రాష్ట్రీయం

నేటి నుంచి నర్సాపూర్-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 19: నరసాపూర్-విశాఖపట్నం (నెం.17241, 17242) సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలును మంగళవారం నుంచి రద్దుచేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. నరసాపూర్ నుండి ప్రతి రోజూ ఉదయం ఆరు బోగీలతో బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ రైలును లింకు ఎక్స్‌ప్రెస్‌గా గత కొన్ని దశాబ్దాలుగా నడుపుతున్నారు. ఈ రైలు నిడదవోలు చేరుకున్నాక, గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు ఈ ఆరు బోగీలను కలిపేశారు. అలాగే తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుండి గుంటూరుకు ఉదయం బయలుదేరే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ నిడదవోలు చేరుకున్నాక అందులోనుండి నరసాపురం వైపు వెళ్లే ఆరు బోగీలను వేరుచేసేవారు. ఆ ఆరు బోగీలను ఒక డీజిల్ ఇంజిన్‌కు కలిపి నరసాపురం పంపించేవారు.
చాలా ఏళ్లుగా నడుపుతున్న ఈ రైలు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, ఆచంట, తణుకు తదితర నియోజకవర్గాలతోపాటు తూర్పు గోదావరి జిల్లా రాజోలు, సఖినేటిపల్లి తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణీకులకు ఎంతో సౌకర్యంగా ఉండేది. వేలాదిమంది ప్రయాణీకులతో నిత్యం రద్దీగా ఈ రైలు నడుస్తోంది. ఇటీవల రైల్వే ఉన్నతాధికారులు ఈ ప్రాంతాల్లో పరిశీలన అనంతరం ఈ రైలును రద్దుచేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
కాగా రద్దుచేసిన నరసాపూర్-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ స్థానంలో ఒక డిఎంఎ పాసింజర్ రైలును రైల్వే శాఖ నడపనున్నట్టు సమాచారం. అంటే విశాఖపట్నం వెళ్లాల్సిన ప్రయాణీకులు నిడదవోలు వరకు ఈ పాసింజర్ రైలులో వెళ్లి, నిదడవోలులో గుంటూరు నుండి వచ్చే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాల్సివుంటుంది. ఈ నిర్ణయంపై ప్రయాణీకుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఈ విషయంపై జోక్యం చేసుకుని, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ యథావిథిగా నడిపేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.