రాష్ట్రీయం

డీసీఐ ఆస్తుల మదింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 19: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)ను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ఈ సంస్థ ఆస్తులను మదించేందుకు వాల్యుయేటర్లను సోమవారం ఇక్కడికి పంపించింది. ముంబైకి చెందిన ప్రొటోకాల్ ఇన్స్యూరెన్స్ సర్వేయర్స్ అండ్ లాస్ ఎసెసర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రంగంలోకి దిగింది. వీరికి ఆర్‌బీఎస్‌ఎ ట్రాంజాక్షన్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థలకు చెందిన ప్రతినిధుల బృందం సోమవారం డీసీఐ కార్యాలయానికి చేరుకుని ఆస్తుల మదింపు ప్రక్రియను ప్రారంభించింది. వీరు రెండు రోజులపాటు ఇక్కడే ఉండి, స్థిర చరాస్తులను లెక్కవేస్తారని డీసీఐ వర్గాలు తెలియచేస్తున్నాయి. ఆరు వేల కోట్ల రూపాయల విలువైన డీసీఐ ఆస్తులను కేవలం 1450 కోట్ల రూపాయలకు విక్రయించాలని చూస్తోందని డీసీఐ ఉద్యోగులు చెపుతున్నారు.