ఆంధ్రప్రదేశ్‌

ఎపీ ఎంసెట్‌కు అనూహ్య స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 21: ఏపీ ఎంసెట్-2018కి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు పెద్ద సంఖ్యలో దాఖలవుతున్నాయి. ఇప్పటివరకు ఇంజనీరింగ్ విభాగానికి 1 లక్ష 12వేల 250 మంది, వ్యవసాయ, వైద్య విభాగాలకు సంబంధించి 50,624 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు విభాగాలకు కలిపి 687 మంది మొత్తం లక్ష 63వేల 561 మంది బుధవారం నాటికి దరఖాస్తులు దాఖలు చేసుకున్నట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి చెప్పారు. అపరాధ రుసుం లేకుండా ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. రూ.500 అపరాధ రుసుంతో మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 11వ తేదీ వరకు వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో, ఏప్రిల్ 16వ తేదీ వరకు రూ.5000 అపరాధరుసుముతో, ఏప్రిల్ 21వ తేదీ వరకు రూ.10వేల ఆపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఇంజనీరింగ్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే వారు 2018 డిసెంబరు 31కి 16ఏళ్లు పూర్తయి ఉండాలని, వ్యవసాయ, వైద్య విభాగాలకు దరఖాస్తు చేసుకునేవారికి 17 సంవత్సరాలు పూర్తయ్యుండాలని స్పష్టంచేశారు. నిర్దేశించిన వయస్సు లేని పక్షంలో సదరు విద్యార్థులు ఎంసెట్ కార్యాలయానికి డిక్లరేషన్ ఫారం సహా ఎస్సెస్సీ మార్కుల జాబితా, ఇంటర్ హాల్‌టిక్కెట్లను జతచేసి పంపితే ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతిస్తామని తెలియజేశారు. సదరు విద్యార్థులకు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి కళాశాలల్లో ప్రవేశానికి అవకాశం కల్పిస్తామన్నారు.
6నుండి 10వ తరగతి వరకు రాష్ట్రంలో విద్యనభ్యసించిన వారిని లోకల్ గాను, ఇతర రాష్ట్రాల్లో విద్యనభ్యసించిన వారిని నాన్ లోకల్‌గా పరిగణిస్తామని కన్వీనర్ చెప్పారు. విద్యార్థి దరఖాస్తును ఆన్‌లైన్‌లో ఒకసారి మాత్రమే ఆమోదిస్తామని, ఫీజు చెల్లించిన అనంతరం ఆయా వివరాలతో పాటు పేమెంట్ రిఫరెన్స్ ఐడీ నంబరును విద్యార్థుల మొబైల్ నంబర్లకు సంక్షిప్త సమాచారం ద్వారా అందిస్తామని చెప్పారు. ఈ వివరాలను భవిష్యత్ అవసరాల దృష్ట్యా జాగ్రత్తగా భద్రపరచుకోవాలని విద్యార్థులకు సూచించారు. దరఖాస్తులను పూరించే సమయంలో ఇంటర్ రెండో సంవత్సరం హాల్‌టిక్కెట్, ఎస్సెస్సీ సర్ట్ఫికెట్, కులధ్రువీకరణ పత్రం (ఎస్సీ ఎస్టీ బీసీ), రేషన్/ ఆధార్ కార్డులు, అంగవైకల్యం ఉన్నవారు సదరమ్ సర్ట్ఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, విద్యార్హత, నివాస ధ్రువీకరణ పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని స్పష్టంచేశారు. విద్యార్థులు మూడు రీజనల్ సెంటర్లను ఆన్‌లైన్ దరఖాస్తులో ఎంపిక చేసుకోవల్సి ఉంటుందని, విద్యార్థుల ప్రాథాన్యత ఆధారంగా ఏదైనా ఒక రీజనల్ సెంటర్ పరిధిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తామని చెప్పారు. హాల్ టిక్కెట్లను ఏప్రిల్ 18వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ డాక్టర్ సాయిబాబు తెలిపారు.