రాష్ట్రీయం

బాబును బోనులో నిలబెట్టడం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బోనులో నిలబెట్టేంత వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తూనే ఉంటానని వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రకటించారు. విజయసాయి బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు అవినీతితో సంపాదించిన డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు అవినీతి గురించి వివరించి ఆయన అక్రమాలపై దర్యాప్తుకు అదేశించేలా ఒప్పించేందుకే తాను తరచూ మోదీని కలుస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుపై దర్యాప్తుకు ఆదేశించేంత వరకు ప్రధాన మంత్రిపై వత్తిడి తెస్తూనే ఉంటామన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ అప్పు 97వేల కోట్లు.. ఈ రోజు అది రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లకు చేరిందని ఆయన చెప్పారు.
గత నాలుగేళ్లులో అప్పుగా తెచ్చిన లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయింది? కేంద్రం నుండి వచ్చిన నిధులు ఎక్కడికి పోయాయి? రాష్ట్రంలో పన్నుల రూపంలో వచ్చిన డబ్బు ఎక్కడికి పోయింది? అని ఆయన ప్రశ్నించారు. ఈ డబ్బంతా చంద్రబాబు చేబులోకి పోయిందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఆ డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలించారు.. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి దృష్టికి తెచ్చాను.. ఈ విషయాలు చెప్పేందుకే తరచు ప్రధానిని కలుస్తున్నానని విజయసాయి రెడ్డి ప్రకటించారు. చంద్రబాబుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేంత వరకు మోదీ వద్దకు వెళుతూనే ఉంటానని స్పష్టం చేశారు.