ఆంధ్రప్రదేశ్‌

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 21: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి మహాద్వారం వద్దకు రాగానే టీటీడీ ఈ ఓ అనిల్‌కుమార్ సింఘాల్ సాదరంగా ఆహ్వానించారు. ధ్వజ స్తంభానికి నమస్కరించుకుని ఆలయంలోని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవకుళమాతను, ఆలయ ప్రదక్షిణగా వచ్చి విమాన వెంకటేశ్వర స్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగనరసింహ స్వామివారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి తన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్, కొడుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్, కోడలు బ్రాహ్మణి, వియ్యంకుడు బాలకృష్ణతో కలిసి రంగనాయకుల మండపం చేరుకున్నారు. అక్కడ వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం టీటీడీ ఈఓ, తిరుమల జేఈఓలు కలిసి ముఖ్యమంత్రికి, కుటుంబ సభ్యులకు శ్రీవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం, శ్రీవిలంబినామ సంవత్సర టీటీడీ పంచాంగం అందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల చిన్నజీయర్ స్వామి, డిఐజీ ప్రభాకర్‌రావు, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, సీవీఎస్వో ఆకె రవికృష్ణ, అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, ఆలయ డిప్యూటి ఈఓ హరీంద్రనాధ్, విజిఓ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
భక్తులకు అన్న ప్రసాదం వడ్డించిన బాబు
శ్రీవారి దర్శనానంతరం తరిగొండ వెంగమాంబ భవనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరీ, మంత్రి నారాలోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి ఇతర కుటుంబ సభ్యులు స్కార్ఫ్‌లు ధరించి స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. భక్తులతో కలిసి భోజనం చేశారు. తన మనవడు దేవాన్ష్ 4వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాదానికి అయ్యే రూ. 26లక్షల ఖర్చును ఆన్‌లైన్ ద్వారా విరాళంగా అందించారు.