ఆంధ్రప్రదేశ్‌

భక్తి శ్రద్ధలతో శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: రాజధాని అమరావతిలో బుధవారం ఉదయం 8.23కు సిఎం చంద్రబాబు తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నల్లూరు పండితులు ధాతుస్థానం, రత్నాన్యాసం, ఇష్టికాన్యాసం తదితర పూజలను ఘనంగా నిర్వహించారు. సిఎం చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి హారతిపట్టారు. అనంతరం నవధాన్యాలు, సిమెంటుతో శంకుస్థాపన కావించారు. వెలగపూడి కేంద్రంగా ప్రజలకు సుపరిపాలన అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, చైర్మన్ చక్రపాణి, మంత్రులు యనమల రామకృష్ణుడు, పి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, పరిటాల సునీత, పీతల సుజాత, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం పాల్గొన్నారు.