రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో 13 సంస్థలకు స్వయం ప్రతిపత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: ఉన్నత విద్యాసంస్థలపై ని యంత్రణను సరళీకృతం చేసే క్రమంలో దేశవ్యాప్తంగా 60 విద్యాసంస్థలకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ పూ ర్తిస్థాయి స్వయం ప్రతిపత్తిని ప్రసాదించగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 13 సంస్థలకు ఈ అవకాశం దక్కింది. జాతీయ స్థాయి గ్రేడ్-1 స్థాయిలో రెండు యూనివర్శిటీలు నిలవగా, అందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ కూడా ఆ ఘనతను దక్కించుకుంది. దేశవ్యాప్తం గా కేటగిరి -1లో రెండు సెంట్రల్ యూనివర్శిటీలు, 12 రాష్ట్ర యూనివర్శిటీలు, 11 డీమ్డ్ వర్శిటీలు ఉండగా, కేటగిరి-2లో మూడు సెంట్రల్ యూనివర్శిటీలు, 9 స్టేట్ యూనివర్శిటీలు, 13 డీమ్డ్ వర్శిటీలు, రెండు ప్రైవేటు వర్శిటీలు, 8 అటానమస్ కాలేజీలున్నాయి. కేటగిరి -1లో ఢిల్లీ జెఎన్‌యు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి మాత్రమే అవకాశం దక్కింది. కేటగిరి -2లో బెనారస్ హిందూ యూనివర్శిటీ, అలిఘర్ ముస్లిం యూనివర్శిటీ, హైదరాబాద్‌లోని ఇఫ్లూ ఉన్నాయి. కేటగిరి-1లో రాష్ట్ర వి శ్వవిద్యాలయాల్లో జాదవ్‌పూర్ యూనివర్శిటీ, అలగప్పా యూనివర్శిటీ, నల్సార్ యూనివర్శిటీ (హైదరాబాద్), సావిత్రీ భాయి పూలే యూనివర్శిటీ, ఆంధ్రా యూనివర్శిటీ, నేషనల్ లా యూనివర్శిటీ, ఉత్కల్ యూనివర్శిటీ, కరుక్షేత్ర యూనివర్శిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ, ఉస్మానియా యూనివర్శిటీ, గురునానక్ దేవ్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ జమ్మూ-కాశ్మీర్, యూనివర్శిటీ ఆఫ్ మైసూర్, అన్నా యూనివర్శిటీ, పంజాబ్ యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, పంజాబీ యూనివర్శిటీ (పాటియాలా), రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ లా (పాటియాల), నేషనల్ లా యూనివర్శిటీ (కటక్), యూ నివర్శిటీ ఆఫ్ మద్రాస్, జీజేయూఎస్‌టీ (హిస్సార్) ఉన్నా యి. డీమ్డ్ వర్శిటీల జాబితాలో హోమీ బాబా నేషనల్ ఇన్‌స్టిట్యూట్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్ (తిరుపతి), గీతం (విశాఖ), నార్సీమోంజీ (ముంబై), శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ (చెన్నై), డాక్టర్ డీవై పాటిల్ విద్యాపీఠ్ (పూనే), శాస్త్ర(తంజావూరు), సింబియాసిస్ (పూనే), ఐ సీటీ (ముంబై) డీఎంఐఎంఎస్ (వార్ధా), టీఐఎస్‌ఎస్ (ముంబై) ఉన్నాయి. కేటగిరి-2లో టెరి (న్యూఢిల్లీ), జైన్ వర్శిటీ (బెంగలూరు), విట్ (వెల్లూరు), మణిపాల్ వర్శిటీ , కేఎల్‌ఈ (బెల్గం), అమృత విశ్వవిద్యాపీఠం, కిట్(్భవనేశ్వర్), జెఎస్‌ఎస్(మైసూర్), ఇక్ఫాయి, డాక్టిర్ ఎంజీఆర్ ఈఆర్‌ఐ(చెన్నై), డాక్టర్ డివైపాటిల్ విద్యాపీఠ్ , ది ఇండియన్ లా ఇనిస్టిట్యూట్ (న్యూఢిల్లీ), శిఖా (్భవనేశ్వర్), ఒపి జిందాల్ (సోనిపాట్), పండిట్ దీన్ దయాల్ పెట్రోలియం వర్శిటీ (గాంధీనగర్), కాలేజీల జాబితాలో వైసీఐఎస్ (సతార), ఎస్‌ఎస్ నాడర్ (కలవక్కం), నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీ (హైదరాబాద్), వివేకానంద కాలేజీ (కొల్హపూర్), శ్రీ వాసవి ఇంజినీరింగ్ కాలేజీ (తాడేపల్లిగూడెం), బోనం వెంకట చలమయ్య ఇంజనీరింగ్ కాలేజీ (ఓడలరేవు), జైహింద్ కాలేజీ (ముంబై), ఎస్‌విపికెఎం మితిభాయ్ కాలేజీ ఆఫ్ ఆర్ట్సు (ముంబై) ఉన్నా యి. కాగా 3.5 స్కేల్ దాటి నేక్ అక్రిడిటేషన్ పొందిన కాలేజీలకు పూర్తిస్థాయి స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్నట్టు యూజీసీ పేర్కొంది. వచ్చే ఏడాది నేక్ అక్రిడిటేషన్‌కు అ నుగుణంగా మరిన్ని కాలేజీలకు స్వయం ప్రతిపత్తి క ల్పించనున్నారు.