రాష్ట్రీయం

ప్రయాణికుల కోసం మొబైల్ యాప్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్ధం రెండు రకాల యాండ్రాయిడ్ మొబైల్ యాప్‌లను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ గురువారం ఆవిష్కరించారు. దీంతో పాటు కాచిగూడ రైల్వే స్టేషన్ పైన ఏర్పాటు చేసిన 400కెడబ్ల్యూపి ఆన్‌గ్రిడ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిఎం రెండు యాప్‌లను ఆవిష్కరించారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా ప్రయాణీకులకు మెరుగైన సేవలందించే చర్యల్లో భాగంగా రైల్వే స్టేషన్ సమాచారం యాప్‌ను ఆవిష్కరించారు. పలు రకాల సమాచారాన్ని ఈ యాప్‌ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. రైళ్ల సమాచారంతో పాటు ఎంఎంటిఎస్‌ల వివరాలు, రిటైరింగ్ గదుల సమాచారం, పార్శిల్ ఆఫీస్ వివరాలు వంటి చాలా సేవలు ఈ యాప్‌ద్వారా అందుబాటులోకి వస్తాయని జిఎం ఈ సందర్భంగా చెప్పారు. మరో నేవిగేషన్ యాప్‌ను కూడా ఆవిష్కరించారు. నవ్‌రాస్ పేరుతో ఈ నావిగేషన్ యాప్‌ను దేశంలోనే రైల్వేలో తొలిసారిగా కాచిగూడలో ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రయాణీకులకు స్టేషన్‌కు సంబంధించిన ఏ సమాచారమైనా క్షణా ల్లో తెలుస్తుందని వివరించారు.

చిత్రం..యాండ్రాయిడ్ మొబైల్ యాప్‌లను పరిశీలిస్తున్న
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్