రాష్ట్రీయం

ఏపీపై ఇన్ని కుట్రలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 23: ఏన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏపీపై వరుసగా జరుగుతున్న కుట్రలను ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలను ముఖ్యంగా ఏపీని దెబ్బతీసేందుకు మూడు పార్టీల కుట్రలను ప్రజలతో కలిసి తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రాన్ని బలహీనపర్చేందుకు తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. శుక్రవారం ఎంపీలు, మంత్రులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ‘మన ఎంపీల పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. రాష్టవ్య్రాప్తంగా నిన్న జరిగిన నిరసనలే నిదర్శనం. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర గౌరవాన్ని కాపాడాలి’ అని దిశానిర్దేశం చేశారు. ఇన్ని ఆందోళనలు జరుగుతున్నా పట్టించుకోని కేంద్రం, ఈశాన్య రాష్ట్రాలకు రూ.3వేల కోట్లు విడుదల చేసిందన్నారు.
న్యాయం కోసం పోరాడుతున్నాం, ప్రజల హక్కులు కాపాడమంటున్నాం, తప్పేమిటి? అని ప్రశ్నించారు. ఎంపీలంతా జాగ్రత్తగా వ్యవహరించాలని, భవిష్యత్ ఇబ్బందులు ఎదుర్కొనేందుకు సిద్ధపడాలన్నారు. ఎన్డీఏ, యూపీఏపై కోపం లేదని, రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికి అన్యాయం చేశాయన్నదే బాధ అన్నారు. హోదా ఒక్కటే తీసుకుని ప్రోత్సాహకాలను వదిలేయాలని వైకాపా చూస్తోందనీ, హోదాతోపాటు రాష్ట్రాలకు ఇచ్చిన ప్రోత్సాహకాలన్నీ ఇవ్వాలని మనం అడుగుతున్నామని, ఈవిషయాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు.
‘పోలవరంపై కుట్ర చేస్తున్నారు. ఏపీపై కుట్ర చేస్తున్నారు. దక్షిణాదిలో నాయకత్వాన్ని బలహీనపరచాలని చూస్తున్నారు. సమర్థ నాయకత్వం లేకుండా చేయాలన్నదే వారి కుట్ర. పోరాటంలో ఎవరూ వెనుకంజ వేయరాదు. అదే సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోరాదు. ఎంపీలు సమన్వయంగా పనిచేయాలి’ అని బాబు సూచించారు.
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైఎస్ చౌదరి మాట్లాడుతూ రాజ్యసభలో తన ప్రసంగంలో సగంపైగా తొలగించడంపై నిరసన వ్యక్తం చేశానని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఎంపీలంతా అవిశ్వాసం నోటీసు ఆమోదం పొందడంపైనే తమ దృష్టి కేంద్రీకరించాలన్నారు. రాష్ట్రానికి నిధుల గురించి కేంద్ర మంత్రులతో ఎంపీలు మాట్లాడటాన్ని కూడా వైకాపా అనుకూల మీడియా దుష్ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. దీనిపై ఏంపీలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ లోక్‌సభా పక్షనేత తోట నరసింహం, ఎమ్మెల్సీ టిడి జనార్ధన్, శాసనసభ, శాసనమండలి చీఫ్‌విప్‌లు పల్లె రఘునాధరెడ్డి, పయ్యావుల కేశవ్, ఎంపీలు, అసెంబ్లీ వ్యూహకమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.