రాష్ట్రీయం

ఆటోమోటివ్ హబ్‌గా ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడ: దేశంలోనే అతిగొప్ప ఆటోమోటివ్ హబ్‌గా ఆంధ్రను అభివృద్ధి చేయడమే లక్ష్యమని, ఈక్రమంలోనే దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా హీరో మోటార్స్ పరిశ్రమ చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయడం ఒక చరిత్రగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. సత్యవేడు మండలం మాదనపాళ్యంలో నెలకొల్పిన హీరో మోటార్స్ పరిశ్రమ 2019 మార్చికి తొలి ఉత్పత్తులు ప్రారంభించాలన్నారు. విద్యుత్‌తో నడిచే వాహనాలకు దేశంలో మంచి భవిష్యత్తు ఉందని, ఆ దిశగా దృష్టిసారించాలని హీరో మోటార్స్ కార్పొరేషన్ సీఎండి పవన్ ముంజల్‌కు బాబు సూచించారు. సత్యవేడు మండలం మాదనపాళ్యంలో హీరో మోటార్స్ సంస్థ రూ.1600 కోట్లతో 600 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాలు, విడి భాగాల తయారీ పరిశ్రమకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలోనే హీరో మోటార్ పరిశ్రమ ఏర్పాటైన తొలి రాష్ట్రం ఆంధ్ర కావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. శ్రీసిటీ వద్ద 1.8 మిలియన్ల వాహనాల ఉత్పత్తి లక్ష్యంగా సంస్థ ఏర్పాటవుతోందన్నారు. హీరో మోటార్‌కు దేశ, విదాశాల్లో ఉన్న 7 పరిశ్రమల్లో వినియోగిస్తున్న పరిజ్ఞానం కన్నా అత్యాధునిక పరిజ్ఞానంతో చిత్తూరు జిల్లాలో మోటార్ వెహికల్స్ తయారు కానున్నాయన్నారు. పవన్ ముంజాల్ 2019 డిసెంబర్ నాటికి తొలిదశ ఉత్పత్తులు తీసుకువస్తామని అన్నారని. అయితే 2019 మార్చికే మార్కెట్‌లోకి తొలి ఉత్పత్తులను తేవాలని తాను కోరినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఏవిధమైన సహాయ సహకారాలు అందించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని సీఎం బాబు హామీ ఇచ్చారు.
ఇప్పటికే చిత్తూరులో ఇసూజీ మోటార్స్ రూ. 1500 కోట్లతో సంస్థను నెలకొల్పిందని, అనంతపురంలో కియో మోటార్స్‌ను ఏర్పాటు చేశారన్నారు. మరికొన్ని కొత్త పరిశ్రమలూ రానున్నాయన్నారు. విభజన తరువాత దేశంలోనే అత్యధిక పెట్టుబడులు పొందిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. కార్యక్రమంలో మంత్రి అమరనాధ్ రెడ్డి, హీరోమోటార్స్ సంస్థ డైరెక్టర్ విక్రమ్ మాథూర్, నీరజ్ మాథూర్, సంజయ్‌భాను, అశోక్ బన్లీ,
రాకేశ్ వశిష్ట, శ్రీనీ, కంభంపాటి రామ్మోహన్, ఏపీ ఐ సీసీ చైర్మన్ కృష్ణయ్య, ప్రిన్సిపల్ సెక్రటరీ సాల్మెన్ ఆరోగ్యరాజ్, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.
ప్రతి విజయం వెనుక ఒక మహిళ
మగవారి విజయాల వెనుక స్ర్తిశక్తి ఉంటుందని, హీరోమోటార్స్ సీఎండి పవన్ ముంజాల్ విజయాల వెనుక ఆయన సతీమణి అనీష్ ముంజాల్ ఉన్నారన్నారు. ఈసందర్భంగా హీరో మోటార్స్ సంస్థను ఏపీకి తీసుకురావడానికి తాను చేసిన ప్రయత్నాలను పవన్‌ముంజాల్ కుటుంబంతో తనకున్న సంబంధాలను ఆయన వివరించారు. భారతదేశంలో తాజాగా హీరో మోటార్ 7వ పరిశ్రమగా గుజారాత్‌లో ఏర్పాటు చేశారని, 8వ పరిశ్రమను ఏపీలోని చిత్తూరు జిల్లాలో శ్రీసిటీ సమీపంలో ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రపంచంలోనేప్రతిష్టాత్మక సంస్థ హీరోమోటార్స్ అని, భవిష్యత్తులో మాదనపాళ్యంలో తయారయ్యే ఉత్పత్తులు అంతర్జాతీయ విపణిలో కూడా తిరుగులేని డిమాండ్‌ను కలిగివుంటాయన్న విశ్వాసం తనకు ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చిత్రం..వేదికపై హీరో మోటార్స్ సంస్థ సీఎండీ పవన్ ముంజల్‌తో సీఎం చంద్రబాబు మాటా మంతీ