రాష్ట్రీయం

తెరాసది నీచరాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నీచమైన రాజకీయాలకు పాల్పడ్డారని పీసీసీ ఛీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి తెరాసకు వెళ్లిన కలె యాదయ్య, రెడ్యానాయక్, భాస్కర్ రావు, చిట్టం రామ్మోన్‌రెడ్డి, కొరం కనయ్య, విఠల్‌రెడ్డి, అజయ్‌కుమార్‌లు విప్ ధక్కరించారని అన్నారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. వీరి ఓట్లను లెక్కింపులోకి ఎలా తీసుకుంటారని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. ఫిరాయింపు చట్టాన్ని ఉల్లంఘించిన ఏడుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని మరోమారు సభాపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. అత్యున్నతమైన స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చవద్దని ఉత్తమ్‌కుమార్ కోరారు. సీఎం కేసీఆర్‌కు సిగ్గూ, సోయ రెండూలేవని, 63మంది ఎమ్మెల్యేలుంటే ముగ్గుర్ని రాజ్యసభ ఎన్నికల బరిలోకి ఎలాదింపి గెలిపించుకున్నారని ప్రశ్నించారు.
పౌరహక్కుల్ని కాలరాస్తున్నారు: కిషన్‌రెడ్డి
రాజ్యాంగబద్ధంగా పౌరులకు సంక్రమించిన హక్కులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలరాస్తుందని బీజేపీ శాసనసభ పక్షనేత కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రపంచానికి
పట్టెడు అన్నం పెట్టే రైతన్న ఎదుర్కొంటున్న సమస్యలపై ఛలో అసెంబ్లీకి పిలుపు ఇస్తే మారుమూల గ్రామాల్లోని వారిని సైతం అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంచేసి శాంతియుత నిరసనలకు సైతం అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నియంతృత్వ పోకడ ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనపై ప్రజలు దృష్టిపెట్టాల్సి ఉందన్నారు. రైతు సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారాలు సాధించేవరకూ పోరాడుతామని లక్ష్మణ్ హెచ్చరించారు.