ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదాపై అవిశ్వాస తీర్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 16 : వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేరళ మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ఇన్‌చార్జి ఊమెన్ చాందీ అన్నారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇందిర విజ్ఞాన భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బూత్ స్థాయి నుండి కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్రంలో 44 వేల బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. మండల, పట్టణ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి నియోజకవర్గానికి ఒక ఇన్‌ఛార్జిని నియమిస్తామన్నారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 19 వరకు ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించి ఒక్కో ఇంటి నుండి ఒక్కో రూపాయి విరాళంగా సేకరిస్తామన్నారు.
దేశ ప్రజలకు కాంగ్రెస్ అవసరమని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు 24,500కోట్లు ఇస్తామన్నారని, గత నాలుగేళ్లలో కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. నాగావళి నదిపై తోటపల్లి ప్రాజెక్టు, వంశధార ప్రాజెక్టు పనులు కాంగ్రెస్ హయాంలోనే 80 శాతం పూర్తయ్యాయన్నారు. జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉద్దానం ప్రాంతంలో ఉన్నారని వారికి మంచి తాగునీరు సరఫరా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అవసరాలు తీర్చడంలో బీజేపి , టీడీపీ ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు.
2014లో ఎవరైతే కాంగ్రెస్‌ని విడిచి వెళ్లారో వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. రాహుల్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. 2019 ఆగస్టు 15న రాహుల్ గాంధీ ప్రధానిగా ఎర్రకోటపై జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో పనిచేయాలన్నారు. రాహుల్ ప్రధాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే చేస్తారన్నారు.