ఆంధ్రప్రదేశ్‌

మారుతున్న విధానాలకు అనుగుణంగా శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 6: ప్రపంచంలో మారుతున్న విధానాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను అందుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామని జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ సునీత సాంఘ్వీ తెలిపారు. గురువారం నగరంలోని ఒక హోటల్‌లో జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీఏ), రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థలు (ఏపీఎస్‌ఎన్‌డీసీ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఒక రోజు వర్క్‌షాప్‌లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలానుగుణంగా యువతకు ఉద్యోగాల కల్పించటంలో ఎన్‌ఎస్‌డీఏ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. యువతకు ఉద్యోగాలు లభించే విధంగా ఆయా రంగాల్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని శిక్షణ ఇవ్వటంతో వారికి విరివిగా ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. పరిశ్రమల డిమాండ్‌కి అనుగుణంగా శిక్షణ ఇచ్చి సర్ట్ఫికెట్లు ఇవ్వటంతో వారికి ఆయా రంగాల్లో ఉద్యోగావకాశాలు ఆశాజనంగా ఉంటున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశంలో ఇవాళ నైపుణ్యాభివృభివృద్ధి గురించి అందరూ చర్చిస్తున్నారన్నారు. యువతకు దిశా, నిర్దేశం చేయడంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ముఖ్య భూమికను పోషించి యువత జీవితాలకు బంగారుబాటలు వేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్ మాట్లాడుతూ ఏపీలో గత నాలుగు సంవత్సరాలుగా నైపుణ్యాభివృద్ధిలో యువతకు శిక్షణ ఇవ్వటం పట్ల సత్ఫలితాలు రావటం రాష్ట్రానికి మంచి పరిణామని, దీని వల్ల దేశ అభివృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందన్నారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కే సాంబశివరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా తీసుకుంటున్న కార్యక్రమాలను వివరించారు.