ఆంధ్రప్రదేశ్‌

నాటి వాజపేయ నిర్ణయాలే నేటి దేశాభివృద్ధికి పునాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటి), సెప్టెంబర్ 6: నాడు ప్రధానిగా వాజపేయ తీసుకున్న నిర్ణయాలే నేటి దేశాభివృద్ధికి పునాదులని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మైక్రో ఇరిగేషన్.. జాతీయ రహదారుల అభివృద్ధి..బ్యాండ్ విడ్త్ వంటి అధునిక సాంకేతిక పరిజ్ఞానాలను మనదేశానికి తీసుకు రావడంతో పాటు, అణుపరీక్షలతో నాడు వాజపేయి తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధికి బాటలు వేశాయన్నారు. మంత్ర ముగ్ధులను చేసే ఆయన మాటలు అందరిని అకట్టుకునేవన్నారు. వాజపేయి లేకపోవడం సమకాలిన రాజకీయాలకు తీరని లోటన్నారు. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గురువారం మాజీ ప్రధాని వాజపేయి మృతికి సంతాపంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడుతూ వాజపేయి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులను చూసినప్పటికీ, ఎటువంటి అవినీతి ముద్ర ఆయనపై లేదన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తూ హుందాగా వ్యవహరించే వారన్నారు. వ్యక్తిగతంగా వాజపేయితో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవన్నారు. రాష్ట్రంలో 1984 ఆగస్టు సంక్షోభంలో స్వయంగా ఆయన కలుగజేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడారని చెప్పారు. తదనంతరం ఆయనతో కలిసి పని చేసిన సందర్భంలో కేంద్ర క్యాబినెట్‌లోకి ఆహ్వానించినప్పటికీ తిరస్కరించానని గుర్తు చేశారు. తప్పని పరిస్థితుల్లో లోక్‌సభ స్పీకర్ పదవిని బాలయోగికి ఇప్పించామన్నారు. ఒక్క ఓటుతో నాటు అవిశ్వాస తీర్మానంలో ఓడి ప్రధాని పదవి పోయినప్పటికీ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ప్రజాస్వామ్య విధేయతను ప్రదర్శించారని చెప్పారు. మంచిది అని ఏవరు చెప్పినా వారితో ఏకీభవించే తత్వం వాజపేయిదన్నారు. కొన్ని సందర్భాల్లో ఆయనతో విభేదించినప్పటికీ దాన్ని రాజకీయ స్ఫూర్తిగా మాత్రమే స్వీకరించే వారని గుర్తు చేశారు. నాడు రాష్టప్రతి ఎన్నిక సందర్భంగా అలెగ్జాండర్ పేరును వాజ్‌పేయి ప్రతిపాధించగా తాను వ్యతిరేకించినట్లు తెలిపారు.
ఇదే స్థానంలో నాడు అబ్దుల్‌కలామ్ పేరును తాను ప్రతిపాదిస్తే వెంటనే బేషజాలకు పోకుండా అమోదం వేసిన మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి వాజపేయి అని కొనియాడారు. మలేషియా పర్యటనలో భాగంగా తాను అక్కడి రహదారులు, చైనాలోని మైక్రో ఇరిగేషన్ పద్ధతులు, అమెరికాలోని బ్యాండ్ విడ్త్ వంటి వాటిని పరిశీలించి నాడు వాజపేయికి వివరించి మన దేశంలో కూడా తీసుకురావాలని సూచించడంతో వాటిపై అధ్యయనానికి టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయడంతో పాటు, వెంటనే వాటికి కార్యరూపం ఇవ్వటం వల్లనే నేడు మనదేశంలో అన్ని రహదారులు అభివృద్ది చెందాయన్నారు. టెలిఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలు గ్రామస్థాయికి అందుబాటులోకి వచ్చాయన్నారు. నదుల అనుసంధాన ఆవశ్యకతను తెలపడంతో స్పందించిన వాజపేయి టాస్క్ఫోర్సును కూడా ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ప్రోక్రాన్ అణుపరీక్షలతో దేశ ఖ్యాతిని మరింత పెంచిన వాజపేయి, కార్గిల్ యుద్ధంతో అంతర్జాతీయ ఖ్యాతి గడించారన్నారు. పాకిస్తాన్‌తో సత్సంబంధాల పెంపునకు ఎంతో కృషి చేసిన వాజపేయి ఢిల్లీ - లాహోర్ బస్సును ఏర్పాటు చేయడమే కాకుండా తానే మొదటగా ప్రయణం చేశారని గుర్తు చేశారు.
హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం వాజపేయికి వివరించిన సందర్భంలో కేంద్ర విమానయానశాఖ అభ్యంతరం పెట్టినప్పటికీ వాటిని పక్కన పెట్టిమరీ హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులను తీసుకు వచ్చినట్లు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణం విషయంలో డిఫెన్స్ లెబరేటరీ అభ్యంతరం పెట్టడంతో డిఫెన్స్ లెబరేటరీని అక్కడ నుండి తరలించి ఎయిర్‌పోర్టు నిర్మాణానికి నాడు వాజపేయి ఎంతగానో సహకరించినట్లు వివరించారు. తెలుగు వారంటే చనువుగా, ఆప్యాయంగా పలకరించి రాష్ట్ర అభివృద్దికి ఎంతగానో సహకరించే వారని తెలిపారు. అయితే నాటి నుండి నేటి వరకు ఏనాడూ తాను స్వప్రయోజనాలు, పార్టీ నేతల స్వప్రయోజనాల కోసం కేంద్రం వద్ద గానీ, ఎవరి వద్దగానీ చేయి చాచలేదన్నారు. విలువలకు కట్టుబడి ఉన్నానన్నారు. వాజ్‌పేయి దేశాభివృద్ధికి, తాను రాష్ట్భ్రావృద్ధికి శ్రమించినట్లు చంద్రబాబు వివరించారు.