ఆంధ్రప్రదేశ్‌

ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 6: ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. వైద్యం, ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ వైద్యులు, నర్సులు ఇతర సిబ్బంది, వౌళిక సదుపాయాల కొరత కారణంగా ఆశించిన ఫలితాలు రాకపోగా పేద ప్రజలు సరైన వైద్యానికి దూరమవుతున్నారంటూ శాసనసభ సమావేశాల్లో తొలిరోజైన గురువారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో అధికారపక్ష తెలుగుదేశం, ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక, సాముదాయిక, ఆరోగ్య కేంద్రాల్లో వైద్య, సాంకేతిక సిబ్బంది కొరతపై తెదే సభ్యులు పంచకర్ల రమేష్‌బాబు ప్రస్తావించగా, దాదాపు 20 నిమిషాల పాటు చర్చ జరిగింది. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఓ దశలో కల్పించుకుంటూ సభ్యుల ఆందోళనతో పూర్తిగా ఏకీభవించారు. ప్రభుత్వానికి అన్ని శాఖలు సమానమే అయినప్పటికీ విద్య, వైద్య శాఖలు రెండు కళ్లులాంటివన్నారు. ఆసుపత్రులకు మెరుగైన వైద్య పరికరాలు అందుతున్నా అనేక లోపాలున్నాయని డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, మందులు కొరత తీవ్రంగా ఉంటున్నదన్నారు. అధికారుల మధ్య సమన్వయలోపం.. పైగా అనవసర జోక్యం ఇలాంటి కారణాలతో గిరిజన ప్రాంతాల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ గత పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని, అయితే గత నాలుగేళ్లలో ఎంతో మెరుగుపడిందని, ఆసుపత్రుల భవనాలు, వైద్య పరికరాలు మరమ్మతులు పరిశుభ్రత, డయాలసిస్ వంటి వాటి కోసం దాదాపు 14 ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను నియమించామన్నారు. ‘నరేగా’తో అనుసంధానమై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామన్నారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలకు ఇటీవలే జీతాలు పెంచామన్నారు. స్మార్ట్ సిటీ విశాఖలో వైద్య, ఆరోగ్యశాఖ, మున్సిపల్ సిబ్బంది మధ్య సమన్వయ లోపం వలనే డెంగ్యూ ప్రబలిందన్నారు. మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ధవళేశ్వరం ఆసుపత్రిలో గదులు లేక రోగులు ఆరుబయట మంచాలపై పడుకోవాల్సి వస్తున్నదన్నారు. తెనాలి శ్రావణ్‌కుమార్, మీసాల గీత, గౌతు శివాజీ, మృణాళిని, చిరంజీవులు, చాంద్‌బాషా తదితరులు మాట్లాడుతూ కొన్ని ఆసుపత్రుల్లో ధర్మామీటర్లు కూడా లేవన్నారు.