ఆంధ్రప్రదేశ్‌

సంస్కరణల రూపశిల్పి వాజపేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), సెప్టెంబర్ 6: పోఖ్రాన్ అణు పరీక్షలు విజయవంతం నిర్వహించి ప్రతి భారతీయుడు గొప్పగా, గర్వంగా చెప్పుకునేలా దేశ ఖ్యాతిని పెంచిన మహోన్నత నేత వాజపేయి అని శాసనసభ్యులు కొనియాడారు. ప్రేమ, విశాల దృక్పథం కలగలిసిన వాజపేయి వ్యక్తిత్వం కారణంగానే ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచారన్నారు. ప్రజాస్వామ్యాన్ని భుజస్కంధాలపై మోసిన వాజపేయి నిత్యం దేశాభివృద్ధిని కాంక్షించి అందరినీ ఒక్కతాటి పైకి తెచ్చేందుకు కృషి చేశారన్నారు. గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో భారతరత్న అటల్ బిహారీ వాజపేయి మృతికి సంతాపంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై సభ్యులు మాట్లాడారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ ఆగస్టు సంక్షోభ సమయంలో తనను పోలీసులు అరెస్టు చేస్తే గుంటూరు వచ్చిన వాజపేయి అధికారులకు తగిన ఆదేశాలిచ్చి, ప్రజాస్వామ్యాన్ని కాపాడారని గుర్తుచేశారు. బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ప్రధాని హోదాలో వచ్చిన వాజపేయి, తన తండ్రి కూడా కేన్సర్‌తోనే చనిపోయారని చెపుతూ ఎవరికి అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకున్నారన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ వాజపేయి మన నేత అని చెప్పుకోవడం గర్వంగా ఉందన్నారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి అందరినీ సమానంగా చూసిన తత్వం వాజపేయిదన్నారు. దేశంలో సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచి నూతన శిఖరాలకు చేర్చారన్నారు. ఆగస్టు సంక్షోభంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు వాజపేయి తీసుకున్న చొరవ మరువలేనిదన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధాని కోసం ముఖ్యమంత్రులు ఎదురుచూస్తుంటారు కాని, వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కోసం ఆయన ఎదురుచూసిన సందర్భాలను గుర్తుచేశారు. ప్రభుత్వ విప్ యామినీబాల మాట్లాడుతూ వాజపేయి రాజకీయాలకే గౌరవం తెచ్చారన్నారు. దేశ ప్రగతికి చంద్రబాబు ఇచ్చిన సూచనలను స్వీకరించి తెలుగువారిని గౌరవించేవారని గుర్తుచేశారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ దేశ రాజకీయాలను ప్రేమించి, పెళ్లాడిన నేత వాజపేయి అన్నారు. ఏపీ ప్రభుత్వం పథకాలకు వాజపేయి పేరుపెట్టాలని ఆయన సూచించారు. గద్దె రామమోహన్ మాట్లాడుతూ పార్లమెంట్‌పై దాడి సందర్భంలో ఆయన ప్రసంగం దేశభక్తిని పెంచిందన్నారు. పార్లమెంట్ సజావుగా జరిగేలా ఆయన చూపిన చొరవ మర్చిపోలేనిదన్నారు. ప్రధానిగా ఏపీ ఎంపీల కోసం ఆయన ఎంతో సమయాన్ని వెచ్చించేవారిని గుర్తుచేశారు. రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ వాజపేయి దళిత పక్షపాతిగా ఉండేవారన్నారు. బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రెండు, మూడు పార్టీలు కలిసి, విడిపోయే పరిస్థితుల్లో 23 పార్టీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపారన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు నేర్పిన వాజపేయి ఆశయాలు నేటితరాలకు మార్గదర్శకంగా ఉంటాయన్నారు. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ, వాజపేయి మృతికి సంతాప సూచకంగా రెండు నిముషాలు వౌనం పాటించింది.