ఆంధ్రప్రదేశ్‌

ఉన్నత ప్రమాణాలతో వీసీఐసీ కారిడార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 16: విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) ఏర్పాటులో పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఎవరికీ నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని పరిశ్రమలశాఖ కమిషనర్ సిద్ధార్థజైన్ అన్నారు. ఆసియన్ డవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన కారిడార్ ఏర్పాటుపై కీలకోపన్యాసం చేశారు. భారీగా ఉపాధికల్పన జరిగి, ఎక్కువకాలం మనుగడ సాగించాలంటే పర్యావరణానికి నష్టం జరక్కుండా చూడాలన్నారు. ప్రాజెక్టు అమలులో భాగంగా అందరికీ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం పరిశ్రమలకు వౌలిక సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటోందని ఇందులో వీసీఐసీ కీలకమైనదిగా చెప్పారు. భూసేకరణ, ఇతర అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందన్నారు. ఏడీబీ పర్యావరణ నిపుణురాలు నైనెటె పజరాలిగ మాట్లాడుతూ సంస్థ సహకారంతో అమలవుతున్న వీసీఐసీకి సంబంధించి బ్యాంక్ నియమ, నిబంధనలను వివరించారు. ప్రధానంగా ప్రాజెక్టు అమలు యూనిట్లు (పీఐయూ) ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ యూనిట్లు (పీఎంయూ)ల బాధ్యతలను విశదీకరించారు. రక్షణ నిబంధనల అమలుకు పరికరాలుగా ఉపకరించే ఒప్పందాల గురించి ప్రస్తావించారు. ఫెసిలిటీ నిర్వహణ మాన్యువల్ (ఎప్‌ఏఎం) పర్యావరణ అంచనా నిబంధనలు (ఈఏఆర్‌ఎస్), పునరావాస నిబంధనలు, స్థానిక ప్రజల పునరావాస నిబంధనలు (ఐపీపీఎఫ్)లు ఏరకంగా ఉండాలో స్పష్టత రావాలన్నారు. వీటి ద్వారా నిర్వాసితులకు ప్రయోజనాలు కల్పించాల్సి ఉందన్నారు. బలహీనులైన బాధిత ప్రజల ప్రయోజనాలను, కార్మిక ప్రమాణాలు ప్రధానంగా చెప్పారు. ఏడీబీ పర్యావరణ నిబంధనల కన్సల్టెంట్ అనిక్ అజ్మీరా మాట్లాడుతూ బ్యాంకు నిబంధనల ప్రకారం వీసీఐసీ కేటగిరి-బి ప్రాజెక్టు కిందకు వస్తుందని తెలిపారు. భారీగా పర్యావరణ ప్రభావం కలిగి ఉండే కారిడార్లు ఏ కేటగిరిగా పరిగణిస్తామన్నారు. వీసీఐసీ ప్రాజెక్టు అమలుకు సంబంధించి బిడ్ డాక్యుమెంట్లు కాంట్రాక్టర్లు పర్యావరణ పరిరక్షణ నిబంధనలకు లోబడి పనిచేసేవిగా ఉండాలన్నారు. దీంతో పర్యావరణంతో పాటు ప్రజల ప్రయోజనాలు నెరవేరతాయని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు ప్రతిపాదన దశలోనే పర్యావరణ అంచనా వేయటం వల్ల పరిరక్షణ నిబంధనల అమలు తేలికవుతుందని తెలిపారు. ఒక్కో ప్రాజెక్టు, ఒక్కో సైట్‌కు సంబంధించి పర్యావరణ అంచనాలు ఒక్కో విధంగా ఉండవచ్చని, అన్నింటినీ ఒకే గాటన కట్టటం కుదరదని తేల్చిచెప్పారు. ప్రాజెక్ట్ అమలు యూనిట్ (పీఐయూ)తో పాటు కాంట్రాక్టర్లు కూడా బాధిత ప్రజల ప్రయోజనాలపై అంచనాకు వచ్చి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సామాజిక పరిరక్షణ నిబంధనల నిపుణుడు వి చంద్రశేఖరన్ మాట్లాడుతూ నిర్వాసితుల అభీష్టానికి వ్యతిరేకంగా (ఇన్‌వాలంటరీ రీ సెటిల్మెంట్) గురించి తెలుసుకోవాల్సి ఉందన్నారు. నష్టానికి పరిహారం ఇప్వటంతో పాటు పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని ప్రతిపాదించారు. పట్టా భూములున్న వారితో పాటు చాలాకాలం నుంచి సదరు భూముల్లో నివసిస్తున్న, సాగుచేస్తున్న వారు కూడా పరిహారానికి అర్హులే అని తెలిపారు. గ్రామాల్లో నిర్వాసితులైన వారికి రూ 5లక్షల పరిహారం లేదా 20 ఏళ్ల పాటు నెలకు రూ 2వేలు ఇవ్వటం జరుగుతుందన్నారు. చట్టప్రకారం భూసేకరణ జరిపితే ఇదే రకమైన భూములకు ఆ ప్రాంతంలో మార్కెట్‌ధర ఆధారంగా లేదా పరిసరాల్లోని గ్రామాల్లో మూడేళ్ల సగటుధర ఆధారంగా లేదా పీపీపీ ప్రాజెక్టులకు, ప్రైవేటు కంపెనీలు ఇచ్చిన విధంగా ధర నిర్ణయిస్తారని వివరించారు. చట్టప్రకారం భూసేకరణ జరిపిన వాటికి సంబంధించి పరిరక్షణ నిబంధనలను సుస్వాతి బెలియప్ప చర్చించారు. నిర్వాసితులను ఖాళీచేయించక ముందే పరిహారం నిర్ణయించి జీవనోపాధి కోల్పోయే వారుంటే ఉపాధి కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళా హక్కుల పరిరక్షణకు సంబంధించి జెండర్ ఈక్వాలిటీ, సోషల్ ఇంక్లూజివ్ విషయమై ఏడీబీ జండర్ కన్సల్టెంట్ అజీజుర్ రెహ్మాన్ వివరించారు. కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆర్థికంగా, సాజికంగా బలపడే విధంగా ప్రాజెక్టు అమలు ఉండాలని కోరారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలతో పాటు మహిళలకు ప్రయోజన కల్పించాలన్నారు.