ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగులకు 63 శాతం ఫిట్మెంట్‌తో రూ. 25 వేలు కనీస వేతనం ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 11: పెరుగుతున్న ధరల దృష్ట్యా ఉద్యోగులకు 63 శాతం ఫిట్మెంట్‌తో రూ. 25వేల కనీస వేతనం చెల్లించాలని, తాత్కాలిక, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను తక్షణం క్రమబద్ధీకరించాలని, రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా హెచ్‌ఆర్ పాలసీని అమలు పరచాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 94 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సంఘాల కనీస అవసరాలను ప్రతిబింబిస్తూ బొప్పరాజు నాయకత్వంలో దాదాపు 62 సంఘాల ప్రతినిధులతో కలిసి మంగళవారం సచివాలయంలో 11వ పీఆర్‌సీ కమిషనర్ అశుతోష్ మిశ్రాను కల్సి ప్రతిపాదనలను అందజేశారు.
ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ప్రస్తుతమున్న సామాజిక పరిస్థితులను, పెరుగుతున్న ధరలను, సాంకేతిక అంశాలను, జాతీయ ధరల ఇండెక్స్‌ను దృష్టిలో ఉంచుకుని నిష్ణాతులు సుదీర్ఘ అనుభవం కల్గిన నేతలతో చర్చించి తమ నివేదిక అందించామన్నారు.