ఆంధ్రప్రదేశ్‌

100 రోజులు.. 100 చార్జింగ్ స్టేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 14: ఆంధ్రప్రదేశ్‌లో హరిత రవాణా విప్లవం సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్టవ్య్రాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తొలిదశలో 100 రోజుల్లో 100 ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఈ విషయమై ఇంధనశాఖ అధికారులతో మంత్రి కళావెంకట్రావ్‌తో కలసి శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణలో పలు అంశాలపై చర్చించారు. సాధ్యమైనంత త్వరలో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించాలని, చార్జింగ్‌కు అవసరమైన వౌలిక సదుపాయాలను సత్వరమే కమకూర్చుకోవాలని సూచించారు. తొలిదశలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎదురుచూడకుండా రాష్టవ్య్రాప్తంగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. రానున్న ఐదేళ్లలో పదిలక్షల ఈ- వాహనాలును రోడ్లపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని మంత్రి కళా వెంకట్రావు స్పష్టంచేశారు. దేశంలో మరే ఇతర రాష్ట్రం ఇంతటి విప్లవాత్మక నిర్ణయం తీసుకోలేదని గుర్తుచేశారు. రాష్ట్రానికి త్వరలోనే పదివేల ఈ- వాహనాలు, 4వేల చార్జర్లను సరఫరా చేసేందుకు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్)తో అవగాహన ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తొలుత చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 13 జిల్లాల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఇందుకోసం ప్రతి జిల్లాలో తరచు సందర్శించే పది ప్రాంతాలను గుర్తించాలని ఏపీ డిస్కం సీఎండీలను మంత్రి ఆదేశించారు. కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని, టెండర్లు ఆహ్వానించడం సహా ఈ ప్రక్రియ సెప్టెంబర్‌లోగా పూర్తికావాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు రానున్న వంద రోజుల కాలంలో (డిసెంబర్ 10 నాటికి) కనీసం 100 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ఎలక్ట్రిక్ రవాణా వ్యవస్థ చమురు ఆధారిత రవాణా కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, స్వచ్ఛమైందని చెప్పారు. రాష్ట్రంలో కాలుష్య రహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్షగా తెలిపారు. రానున్న ఐదేళ్లలో ఈ- వాహనాల కోసం 30 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. ఇందుకు రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదముద్ర వేసిందన్నారు. ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ మాట్లాడుతూ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన అంశాలపై సమగ్ర నివేదిక నివేదిక సమర్పించాలని ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే 2.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లను మంజూరు చేశామని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె విజయానంద్ తెలిపారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని రైతులకు పగటిపూట నిరంతరం 7 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ అవసరంలేనిచోట పెండింగ్‌లో ఉన్న అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ దరఖాస్తులను పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.
విద్యుత్‌శాఖ సలహాదారు కె రంగనాధం, ట్రాన్స్‌కో జేఎండీలు దినేష్ పరుచూరి, ఉమాపతి, డిస్కంల సీఎండీలు ఎంఎం నాయక్, హెచ్‌వై దొర, నెడ్‌క్యాప్ ఎండీ కమలాకరబాబు, ఏపీ ఎస్పీసీఎల్ ఎండి ఆదిశేషు, ట్రాన్స్‌కో డైరెక్టర్లు జెవి రావు, వై ఆడమ్, జెన్‌కో డైరెక్టర్లు, ఈపీడీసీఎల్ డైరెక్టర్లు టీవీఎస్ చంద్రశేఖర్, శేషుకుమార్, తదితరులు టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.