ఆంధ్రప్రదేశ్‌

బాబ్లీ కేసు ఎత్తేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం టౌన్, సెప్టెంబర్ 14: బాబ్లీ ప్రాజెక్టు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర నాయకులపై పెట్టిన కేసులను తొలగించాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతపురంలో విలేఖరులతో మాట్లాడుతూ బాబ్లీపై ప్రజలు, రైతుల కోసమే పోరాటం చేశారన్నారు. ఆ కేసును ఆ దృష్టికోణంతోనే చూడాలన్నారు. పోరాటం చేయటానికి ఎవరికైనా స్వేచ్ఛ ఉండాలన్నారు. రాష్ట్ర మంతటా సెక్షన్-30, 142 ఆంక్షలు అమలులో పెట్టారని, ఈ విషయం గమనించాలన్నారు. ఉద్యమిస్తే చాలు ముందస్తు హౌస్ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు సమస్యలు వచ్చినపుడు స్వేచ్ఛగా ఉద్యమించటానికి అవకాశం ఇవ్వాలన్నారు. మాతో సహా రాష్ట్రంలో లక్షల మందిపై కేసులు ఉన్నాయన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఒకే రకంగా ఉండాలన్నారు. అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో రకంగా ఉండటం సరికాదన్నారు. నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం, సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో తమపై కేసులు పెట్టారన్నారు. వాటిని ఇంతవరకూ తొలగించలేదన్నారు. ముఖ్యమంత్రిపై కేసు పెడితే ఇంత బాధపడుతున్నారన్నారు. దొంగతనం చేసినా, హత్యలు చేసినా వేరేగా చూడాలన్నారు. ముఖ్యమంత్రిలాగే ప్రతిపౌరుడు బాధపడుతున్నారన్న విషయం గుర్తించాలని రఘువీరా సూచించారు.