ఆంధ్రప్రదేశ్‌

కళ్లాల వద్దనే కొనుగోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 18: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ధాన్యానికి కేంద్రప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరలు ఈ సీజన్ నుంచే అమలులోకి వస్తాయన్నారు. ఈ మేరకు సాధారణ రకానికి క్వింటాల్‌కు రూ 1750, ఏ గ్రేడ్ ధాన్యానికి రూ 1770 చెల్లించనున్నట్లు చెప్పారు. ఆయకట్టు పెరిగినందున వరి ధాన్యం లభ్యత 2018-19 సీజన్‌లో 86.17 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేశామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు దోపిడీకి గురికాకుండా ‘కళ్లాల వద్దనే ధాన్యం కొనుగోలు’ అనే వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. కొత్త విధానంలో భాగంగా రైతుల కళ్లాల వద్దనే పేరు నమోదు చేసుకుని పంట విస్తీర్ణం, భూమి సర్వే నెంబరు తదితర వివరాలు నమోదుచేసి తగిన రశీదుతో ఆ ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అనుమతిపత్రం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. మద్దతుధరతో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో వారి ఖాతాలో డబ్బు జమ అవుతుందన్నారు. లక్ష్యానికి మించి అధికంగా వచ్చే ధాన్యం కొనుగోలుపై అధికారులు తగిన విధంగా స్పందించాలని సూచించారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి రాష్టవ్య్రాప్తంగా 15 వందల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన సంచులు, బియ్యం నిల్వ చేయటానికి గోదాములు, రైస్‌మిల్లుల ఎంపిక, మిల్లర్లతో ఒప్పందాలు, బ్యాంక్ గ్యారంటీ, ధాన్యం సేకరణ, రవాణాకు పౌరసరఫరాల సంస్థ అవసరమైన చర్యలు చేపడుతుందని వివరించారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి సేకరించిన ధాన్యాన్ని రకాలు వారీగా నిల్వచేయాలని మిల్లర్లకు సూచించారు. రాష్ట్రంలో ప్రజలు ఆసక్తిచూపని ఎంటియు 1001,1010 రకాలను ఈ ఖరీఫ్ సీజన్‌లోనే సాగుకు అనుమతించామని చెప్పారు. వచ్చే సీజన్‌కు అనుమతి లేదన్నారు. రాష్ట్రంలో ఏ మిల్లరుకు బ్యాంక్ గ్యారంటీ నుంచి మినహాయింపు లేదని స్పష్టంచేశారు. మిల్లులకు సరఫరాచేసే విద్యుత్‌ను 200 హెచ్‌పీ వరకు లోటెన్షన్ కింద పరిగణించాల్సిందిగా విద్యుత్‌శాఖను ఆదేశించాలని మిల్లర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. మిల్లర్లు రీ సైక్లింగ్ చేసినా, ధాన్యానికి సకాలంలో బియ్యం ఇవ్వకపోయినా, పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసిన కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో పౌరసరఫరాలశాఖ కమిషనర్ బి రాజశేఖర్, ఎండీ ఎ సూర్యకుమారి, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, మిల్లర్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.