ఆంధ్రప్రదేశ్‌

సీసీఈ పరీక్షా విధానంలో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: పాఠశాల విద్యకు సంబంధించి కంటిన్యువస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ (సీసీఈ) పరీక్ష విధానంలో కొన్ని మార్పులు చేసేందుకు రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై విద్యా సంవత్సరంలో రెండు సమ్మెటివ్ అసెస్‌మెంట్స్ ఉంటాయి. మొదటిది నవంబర్ 1 లేదా 2వ వారంలో, రెండవది మార్చి/ఏప్రిల్‌లో ఉంటుంది. 10వ తరగతికి సంబంధించి ఎస్‌ఏ 2ను ప్రీ-ఫైనల్ పరీక్షగా మార్చిలో నిర్వహిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి 6 నుంచి 9 తరగతులకు ఎస్‌ఏ 1లో డిస్క్రిప్ట్రివ్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మెయిన్ పేపరు, బిట్ పేపరు ఉంటుంది. ఎస్‌ఏ 2 డిస్క్రిప్ట్రివ్‌గా మాత్రమే ఉంటుంది. 20 ఇంటర్నల్ మార్కులకు సంబంధించి 6 నుంచి 9 తరగతుల వరకు నాలుగు ఫార్మేటివ్ అసెస్‌మెంట్స్, ఎస్‌ఏ 1 నుంచి మదింపు చేస్తారు. టెన్త్‌కు సంబంధించి నాలుగు ఫార్మేటివ్ అసెస్‌మెంట్స్ నుంచి 10 మార్కులు, ఎస్‌ఏ 1నుంచి 10 మార్కులను మదింపు చేస్తారు.

‘చలో అసెంబ్లీ’ భగ్నం
విజయవాడ, సెప్టెంబర్ 18: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ఆంధ్ర ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (్ఫ్యప్టో) మంగళవారం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేసి వేలాది మంది ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వేర్వేరు పోలీసు స్టేషన్‌లలో నిర్బంధించారు. వివిధ జిల్లాల్లో వేలాది మంది టీచర్లను గృహ నిర్బంధం చేసి, బస్సుల్లో తనిఖీలు చేసి బలవంతంగా తిరిగి వెనక్కి పంపించారు. విజయవాడలో ఫ్యాప్టో చైర్మన్ బాబురెడ్డి, సెక్రటరీ జనరల్ జీ హృదయరాజు, యుటీఎఫ్ అధ్యక్షుడు సాబ్జీ, మాజీ అధ్యక్షుడు ఐ వెంకటేశ్వర్లు వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలతో సహా 2వేల మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు,వీ బాలసుబ్రహ్మణ్యం, వై శ్రీనివాసులరెడ్డి, కత్తి నరసింహారెడ్డిని కూడా అరెస్ట్ చేసి వేర్వేరు పోలీసు స్టేషన్‌లలో నిర్బంధించారు. ఈ అక్రమ అరెస్ట్‌లకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, తదితరులు ఖండించారు.