ఆంధ్రప్రదేశ్‌

నా కళ్లలోకి చూసే ధైర్యం మోదీకి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 18: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవినీతిలో కూరుకుపోయారని, ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించారని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే తన కళ్లలోకి చూసే ధైర్యం చేయలేకపోతున్నారని రాహుల్ మండిపడ్డారు. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన సత్యమేవ జయతే బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ ప్రధాని దేశ రక్షణను పణంగా పెట్టి లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణ చేశారు. నాలుగేళ్ల క్రితం కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం 126 యుద్ధ విమానాల కొనుగోలులో భాగంగా ఒక్కో విమానానికి రూ. 526 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిందన్నారు. ఈ కాంట్రాక్టును యుద్ధవిమానాల తయారీలో ప్రపంచంలోనే పేరెన్నికగన్న ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)కు ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ విమానాలు తయారై మిలిటరీకి అందితే దేశ రక్షణ వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. అయితే ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే లోపు ఎన్‌డీఏ ప్రభుత్వం కేంద్రంలో గద్దెనెక్కిందన్నారు. ఆ వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్‌ఏఎల్ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టు రద్దు చేసి తన ఆత్మీయుడైన, యుద్ధ విమానాల తయారీలో ఎలాంటి అనుభవం లేని అనిల్ అంబానీకి కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా ఒక్కో విమానం రూ.1600 కోట్లకు కొనుగోలు చేయాలని నిర్ణయించడం వెనుక దేశాన్ని దోచుకోవాలనే ఎత్తుగడ ఉందన్నానరు. దేశ రక్షణ వ్యవస్థను సైతం పణంగా పెట్టి అవినీతికి పాల్పడుతున్న నరేంద్ర మోదీ తనను తాను ప్రజలకు కాపలాదారునిగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఆయన ప్రజలకు కాపలాదారు కాదని దొంగలు, దోపిడీదారులకు కాపలాదారుడని తీవ్ర స్వరంతో అన్నారు. దేశాన్ని దాటించేంత వరకు దొంగలకు కాపలాగా ఉన్నారే గానీ దేశ ప్రజల ధన, మాన ప్రాణలకు కాదని రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలోని అనేక బ్యాంకుల్లో రూ.9 వేల కోట్లు అప్పుగా తీసుకొని దేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్టీకి చెప్పి మరీ విజయ మాల్యా లండన్ పారిపోతుంటే ప్రధాన మంత్రి చూస్తూ కూర్చున్నారని అన్నారు. తనను విజయ మాల్యా కలిసిన మాట నిజమేనని ఆ తరువాతే ఆయన దేశం విడిచి వెళ్లారని జైట్లీ అంగీకరించాక కూడా మోదీ ఆయనను కాపాడుతున్నారంటే మాల్యా తీసుకున్న అప్పుల్లో మోదీ, జైట్లీకి కూడా భాగస్వామ్యముందని ఆరోపించారు. యుద్ధ విమానాల తయారీలో ఎలాంటి అనుభవం లేని అనిల్ అంబానీ కూడా రూ.45వేల కోట్లు బ్యాంకులకు అప్పు ఉన్నారని రాహుల్ తెలిపారు. యుద్ధ విమానాల కొనుగోలు, అప్పులు తీసుకుని దేశం వదిలిపోయిన వారి గురించి తాను ప్రశ్నిస్తే తన కళ్లలోకి చూసే ధైర్యం లేక దిక్కులు చూస్తారని రాహుల్ విమర్శించారు. అవినీతి, దొంగలకు సహకరించడం ఒక ఎత్తయితే ప్రధాని హోదాలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని ఆయన తెలిపారు. తాను అధికారంలోకి వస్తే నల్లధనం వెలికి తీసి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని చెప్పిన మోదీ ఇంత వరకు ఆ సొమ్ము ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించారు. రైతులకు నష్టం జరుగకుండా ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారని, నిరుద్యోగులకు రెండు ఉద్యోగాలు ఇస్తానని చెప్పారన్నారు. అయితే ఒక్క హామీ కూడా అమలు చేయని నరేంద్ర మోదీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాన మంత్రి హోదాలో హామీల అమలును విస్మరించడం అంటే ప్రజలను మోసం చేయడమేనని ఆయన అన్నారు.
ప్రజలకు ఎంతో మేలు చేయాల్సిన జీఎస్‌టి, నోట్ల రద్దు వారికి కీడు చేయగా మోదీ, ఆయన అనుయాయులకు మాత్రమే న్యాయం చేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి, పళ్లంరాజు, కిళ్లి కృపారాణి తదితరులు పాల్గొన్నారు.