ఆంధ్రప్రదేశ్‌

రాహుల్ బహిరంగ సభ విజయవంతం: రఘువీరారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: ‘సత్యమేవ జయతే’ బహిరంగ సభతోపాటు కర్నూలు జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొన్న అన్ని కార్యక్రమాలు విజయవంతం అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొలుత ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, దేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య స్వగ్రామం పెద్దపాడును సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారన్నారు. సంజీవయ్య నిజాయితీని బహిరంగ సభలో గుర్తు చేసిన రాహుల్‌గాంధీ, సంజీవయ్య లాంటి నీతి, నిజాయితీ ఉన్న నాయకత్వం కాంగ్రెస్ అందిస్తుందని చెప్పడం ఎంతో స్ఫూర్తి నింపిందన్నారు. బైరెడ్డి కనె్వన్షన్ సెంటర్‌లో విద్యార్థి, యువజనులతో జరిపిన ముఖాముఖి కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు రాహుల్‌గాంధీ స్పందించిన తీరు, చెప్పిన సమాధానాలు విద్యార్థులను సంతృప్తి పరచాయన్నారు. ఈ తరానికి రాహుల్‌గాంధీ నాయకత్వం కావాలని యువత భావిస్తున్నారని అర్థమవుతోందన్నారు. సబహిరంగ సభలో పాల్గొన్న రాహుల్‌గాంధీ ప్రత్యేక హోదా ఏపీ హక్కని, 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకంతో అమలు చేస్తామని స్పష్టం చేయడం పట్ల ఐదుకోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

పెన్నా నదిలో మునిగి ఇద్దరు మృతి
సంగం, సెప్టెంబర్ 19: ఈత కోసం పెన్నానదిలో దిగిన ఐదుగురు వ్యక్తులలో ఇద్దరు మృతిచెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారిన సంఘటన బుధవారం నెల్లూరు జిల్లా సంగం ఆనకట్ట వద్ద చోటుచేసుకుంది. నీటిలో దిగిన వారిలో ఇద్దరు మృతిచెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. పోలీసుల సమాచారం మేరకు కర్నాటక రాష్ట్రానికి చెందిన యాత్రికులు బస్సులో రొట్టెల పండుగ నిమిత్తం ఆదివారం నెల్లూరుకు వచ్చారు. చుట్టుపక్కల ఉన్న దర్గాలను దర్శించుకున్న యాత్రికులు బుధవారం ఏఎస్ పేట దర్గాను దర్శించుకుని అనంతరం సంగం ఆనకట్ట వద్దకు చేరుకున్నారు. బస్సులో వచ్చిన సుమారు 30మంది యాత్రికులు ఆనకట్ట వద్ద సందడిగా గడుపుతున్న సమయంలో యాత్రికులలో ఐదుగురు ఈత కోసం పెన్నానదిలో దిగారు. కానీ నదిలో లోతు గమనించని ఆ ఐదుగురు ఒక్కసారిగా గుండంలో మునిగిపోయారు. బంధుమిత్రులు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే వారిని వెతికి బయటకు తీశారు. వీరిలో ఒక యువతి, యువకుడు మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. అక్కడ వారికి చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రధాన వైద్యశాలకు తరలించారు. మృతులు కర్నాటక రాష్ట్రం తుముకూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.