ఆంధ్రప్రదేశ్‌

సీపీఎస్‌పై నిపుణుల కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: కాంట్రిబ్యూటరీ పింఛను స్కీమ్ (సీపీఎస్)ను అన్ని కోణాల్లో పరిశీలించేందుకు వీలుగా నిపుణులతో కమిటీని నియమించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. సీపీఎస్‌పై ప్రభుత్వం తన వైఖరి ప్రకటించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పట్టుబట్టినప్పటికీ, తన వైఖరి చెప్పకుండా, నిపుణులతో వివిధ కోణాల్లో పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసన మండలి సమావేశాల్లో సీపీఎస్‌పై వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆందోళన చేయడం తెలిసిందే. ప్రభుత్వం చర్చకు సిద్ధమని, వేరే పద్ధతిలో రావాలని మంత్రి యనమల సూచించారు. ఈమేరకు కాలింగ్ అటెన్షన్ విధానంలో బుధవారం ఈ అంశంపై చర్చకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విఠపుబాల సుబ్రహ్మణ్యం, బొడ్డు నాగేశ్వరరావు, వై.శ్రీనివాసులు రెడ్డి, కత్తి నర్సింహారెడ్డి నోటీసు ఇచ్చారు. దీంతో మండలిలో ఈ అంశంపై చర్చ జరిగింది. చర్చను మంత్రి యనమల ప్రారంభిస్తూ 2004 సెప్టెంబర్ 1 నుంచి కొత్త పింఛను విధానం కేంద్రం అమల్లోకి తెచ్చిందన్నారు. పిఎస్‌ఆర్‌డీఏ చట్టం డీ-అడాప్షన్‌కు ఎటువంటి విధానం లేదని తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకూ రాష్ట్ర విరాళ నిధిగా 5594 కోట్ల రూపాయలు ఉందని, నిర్వహణ కింద ఉన్న ఆస్తులు దాదాపు 7000 కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిపారు. దీనిపై ఎమ్మెల్సీ బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను పాత పింఛను పద్ధతిలోకి తీసుకువెళ్లాలని రోడ్లపైకి వస్తున్నారన్నారు. ఇప్పటి వరకూ 230 మంది చనిపోగా, 100 మంది పదవీ విరమణ చేశారన్నారు. ఈ అంశంపై సూటిగా విధాన పరమైన ప్రకటన కోరుతున్నామన్నారు. సీపీఎస్‌కు ప్రభుత్వం వ్యతిరేకం అని ప్రకటించాలని, అక్కర్లేదు అని చెప్పడానికి భేషజం అవసరం లేదన్నారు. పోరాడి సాధించుకున్న హక్కు పింఛను అని, పిఎఫ్‌ఆర్‌డీఏ చట్టం నుంచి బయటకు రావాలని అనుకుంటున్నట్లు ప్రకటించాలని, తరువాత ఎలా చేయాలో విధి విధానాల గురించి ఆలోచిద్దామన్నారు. రాష్ట్ర ఉద్యోగుల, ప్రభుత్వ సొమ్ము ఎన్‌పీఎస్ ట్రస్టు వద్ద 5500 కోట్ల రూపాయలు ఉండగా, చనిపోయిన వారికి 5 కోట్లు, పదవీ విరమణ చేసిన వారికి 2 కోట్లు చెల్లించిందన్నారు. తమిళనాడులో వేసిన కమిటీ వల్ల ఉపయోగం లేదని, కమిటీ వద్దన్నారు. ఎమ్మెల్సీ ఎ.ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ కేరళలో సీపీఎస్ రద్దు గురించి 3 సంవత్సరాలుగా ఏమీ చేయలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని, క్యాబినెట్‌లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి మాట్లాడుతూ 1.74 లక్షల మందికి పింఛను లేకుండా చేసిందని ఆరోపించారు.
ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ చట్టం నుంచి బయటకు వచ్చే వీలు ఉందన్నారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ సీపీఎస్ నుంచి బయటకు వచ్చేందుకు తమ మద్దతు ఉంటుందన్నారు. దీనిపై మంత్రి యనమల బదులిస్తూ, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదన్నారు. దేశంలో చర్చ జరిగిందని, పార్లమెంట్‌లో చర్చ జరిగిందన్నారు. దీనిపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారని, కానీ ఉద్యోగులకు సంబంధించి 23 అంశాల్లో లబ్ధి చేకూర్చామని గుర్తు చేశారు.
దీని వల్ల భారం పడినా, పరిపాలనలో ఉద్యోగులు భాగస్వాములేనని భావించి, అడిగింది లేదనకుండా ఇచ్చామన్నారు. దీని నుంచి వైదొలిగే అవకాశం కల్పించలేదన్నారు. సీపీఎస్ వల్ల వచ్చే సానుకూల, ప్రతికూల అంశాలను, ఆర్థిక, న్యాయపరమైన తదితర అంశాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. కమిటీ నివేదికను మంత్రివర్గంలో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.