ఆంధ్రప్రదేశ్‌

తలాక్ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 20: ముమ్మారు తలాక్ విషయంలో కేంద్రప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ను ముస్లింలు వ్యతిరేకిస్తున్నారని టీడీపీ శాసనమండలి సభ్యుడు, మండలిలో ప్రభుత్వ విప్ ఎంఏ షరీఫ్ స్పష్టంచేశారు. గురువారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తలాక్ విషయంలో కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ చేయడం ఏకపక్షమని, అత్యున్నత న్యాయస్థానం ముమ్మారు తలాక్ చట్టపరంగా చెల్లదని తీర్పునిచ్చిన తర్వాత, ప్రత్యేకమైన చట్టం తెచ్చేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందో అర్థం కావడం లేదన్నారు. అమాయకులైన ముస్లిం మహిళల ఓట్లను పొందాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ కుట్రగా కనబడుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఉద్దేశమే తప్ప ముస్లిం మహిళలపై సానుభూతితో చేస్తున్న చర్య ఏ మాత్రం కాదన్నారు.
చట్టపరంగా చెల్లని తలాక్‌కు మూ డు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ చట్టాన్ని తీసుకురావడం అన్యాయమన్నారు. ముస్లిం వర్గాల్లో ఈ చట్టాన్ని బలవంతంగా రుద్దడం సరికాదని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుందని, మూడేళ్ల జైలు శిక్షను మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆర్డినెన్స్‌లోని మూడు సంవత్సరాల శిక్షను తొలగించాలని టీడీపీ డిమాండ్ చేస్తుందని చెప్పారు. లేకుంటే ఇటువంటి చట్టాన్ని రూపొందించిన బీజేపీతో పాటు సమర్థిస్తున్న ఇతర రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల్లో తగుమూల్యం చెల్లించుకోక తప్పదని షరీఫ్ హెచ్చరించారు. మైనార్టీలపై దొంగ ప్రేమను చూపుతూ మాటలతో మోసగిస్తున్న ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి ఈ చట్టంపై తన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు.