ఆంధ్రప్రదేశ్‌

యువనేస్తంలో నమోదుకు 10రోజులే గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి యువత నుంచి అమోఘమైన ఆదరణ లభిస్తోంది. అర్హులైన నిరుద్యోగ యువత ఈ పథకం ద్వారా భృతి పొందడం కోసం భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 14న ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి వారం రోజుల్లోనే 2.50 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరో పది రోజులు మాత్రమే గడువు ఉండడంతో మరింత మంది ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. నిరుద్యోగుల వివరాలను వివిధ కంపెనీలు, సంస్థలకు పంపి ఆ కంపెనీలు నిర్వహించే ఉద్యోగ నియామకాల్లో మన రాష్ట్ర యువత ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఇది వీలు కల్పస్తుంది. ఒక అభ్యర్థి తన ఆధార్ కార్డు నెంబర్‌ను వెబ్‌సైట్‌లో నమోదు చేయగానే ఈ పథకానికి ఆ అభ్యర్థి అర్హుడా? కాదా?. ఒక వేళ అర్హుడు కాకపోతే ఏ కారణాలతో అర్హత కోల్పోయారనే ఇందులో కనిపిస్తుంది. ఈ నెల 30వ తేదీ లోపు నిరుద్యోగులు ఈ పథకంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 22 నుంచి 35 సంవత్సరాల వయసు లోపు ఉండి, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.

సాదాబైనామాల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు
విజయవాడ, సెప్టెంబర్ 20: సాదాబైనామాల క్రమబద్ధీకరణ గడువును అక్టోబర్ 15 వరకూ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకునే రైతులు తహశీల్దాను సంప్రదించాలని, తెల్లకాగితాలు, రిజిస్ట్రేషన్ చేయని ఇతర పత్రాలపై చేసుకున్న ఒప్పందాల భూములకు స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇస్తున్నామని తెలిపారు. సాదా బైనామాల రిజిస్ట్రేషన్ కేవలం వ్యవసాయ భూములకే వర్తిస్తుందన్నారు.