ఆంధ్రప్రదేశ్‌

జగన్, ఆయన మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 20: అధికారమే పరమావధిగా, వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా ఏర్పడిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీకి ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన ఎలాంటి సిద్ధాంతాలు, విధానాలు లేవని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. జగన్ పార్టీ ప్రతిపక్షంగా పూర్తిగా విఫలమైందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు. జగన్ పార్టీ బీజేపీతో కుమ్మకైందని లోకమంతా నమ్ముతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే వైకాపా బలహీనపడి కనుమరుగవుతుందనే భయంతోనే జగన్ పార్టీ, ఆయన మీడియా కలవరపడుతున్నదన్నారు. అందుకే కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన పత్రికలో కట్టుకథలు అల్లుతున్నారన్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని దాన్ని 2019లో ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాము అమలు చేస్తామని చెబితే హోదాను కోరుకునే 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే జగన్ పార్టీ, ఆయన మీడియా మాత్రం రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తప్పుడు కథనాలు, సంపాదకీయం వండి వార్చిందన్నారు. అంతేకాదు బీజేపీ వాదనకు అండగా నిలుస్తోందన్నారు. ఇదొక్కటే చాలు జగన్ బీజేపీకి కోవర్టుగా పని చేస్తున్నాడని చెప్పడానికి అన్నారు. గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది మృతి చెందిన ఘోర దుర్ఘటనలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును రక్షించడానికే జస్టిస్ సీవై సోమయాజులు నివేదిక తయారయ్యిందన్నారు. గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు మీడియానే కారణంగా కమిషన్ చూపడం పెద్ద జోక్ అన్నారు. ప్రచారం కల్పించడం మీడియా పని, కానీ భక్తులకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన తెలిపారు. నివేదిక చంద్రబాబును రక్షించడానికే తయారు చేసినట్లుందని ఒక ప్రకటనలో రఘువీరా పేర్కొన్నారు.