ఆంధ్రప్రదేశ్‌

పరువు హత్య కేసుల్లో దోషులను ఉరి తీయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 20: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్యపై ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ స్పందించారు. ప్రణయ్‌ను హత్య చేసిన నిందితులతో పాటు ఎర్రగడ్డ వద్ద మరో ప్రేమజంట సందీప్-మాధవిలపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని ఉరి తీయాలని గురువారం కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కారెం శివాజీ డిమాండ్ చేశారు. పెద్దలను ఎదిరించి కులాంతర వివాహాలు చేసుకున్న జంటలపై ఈ తరహా దాడులు జరగడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కులాంతర వివాహాలు చేసుకునే జంటలకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా నిలుస్తుందన్నారు. ఎవరికైనా పెద్దల నుండి ప్రాణహాని ఉన్నట్టు తెలిస్తే తక్షణమే సమీపంలోని పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా రూ.75 వేలు అందిస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగిపోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ రహస్య అజెండాతో దళితులపై దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. దళితుల హక్కులను కాలరాసే విధంగా దాడులు జరుగుతుండటం బాధాకరమన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన చలో గుంటూరు పేరుతో భారత రాజ్యాంగ పరిరక్షణ మహార్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులను కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. గిరిజనులకు రావల్సిన 7.5శాతం రిజర్వేషన్ అమలు కాని పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నెలకొందన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని తిరగరాసేందుకు కొంత మంది కేంద్ర మంత్రులు ప్రయత్నించడాన్ని తీవ్రంగా అడ్డుకుంటామన్నారు.
అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఎవరైనా సమర్థించాల్సిందేనన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు వంపుగడల చౌదరి తదితరులు పాల్గొన్నారు.