ఆంధ్రప్రదేశ్‌

దొంగే దొంగ అన్నట్లు జగన్ అరుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 20: పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి వ్యవహారం దొంగే దొంగ అని ఇల్లెక్కి అరుస్తున్నట్లు ఉందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం నగరంలోని జలవనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుపై రూ. 14,781 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు రూ. 5,135 కోట్లు ఖర్చు చేయగా, ప్రకటించిన తర్వాత రూ. 9,645 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 6,727 కోట్లు రాగా, ఈరోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,918 కోట్లు ఖర్చుచేసి 58.38 శాతం పనులు పూర్తి చేసినట్లు చెప్పారు.
పోలవరం గ్యాలరీ వాక్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, రైతులు పాల్గొని ఒక కిలోమీటర్ మేర నడచారన్నారు. 2017 మే, ఆగస్టు మాసాల్లో కాగ్ అధికారులు వచ్చి అభ్యంతరాలు తెలపగా పీఏసీ ఆధునికీకరణ పనులు చేపట్టామన్నారు. అంతేకాకుండా వైసీపీ సభ్యుడు, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించినట్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు చోటుచేసుకోలేదన్నారు. ఏమైనా పీఏసీ ముందు కాగ్ అభ్యంతరాలకు జలవనరుల శాఖ అధికారులు సరైన వివరణలు ఇస్తారని మంత్రి ఉమామహేశ్వరరావు వివరించారు.

భూ సేకరణ జాప్యంతో పెరిగిన అంచనా వ్యయం:ప్రత్తిపాటి
గుంటూరు : పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు భూ సేకరణ జాప్యం కావడం వలనే పోలవరం అంచనా వ్యయం పెరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గురువారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు భూ సేకరణ కాంగ్రెస్ హయాంలోనే ఆలస్యమైందని, ప్రస్తుతం ఆ వ్యయం పెరగడం, కేంద్రం నుంచి నిధులు ఆలస్యమవుతున్నప్పటికీ రాష్ట్రప్రభుత్వం పనులను శరవేగంగా కొనసాగిస్తుందన్నారు. సమర్థుడైన చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు పూర్తికాకుంటే పోలవరం మరెప్పటికీ సాకారం కాదని పుల్లారావు అభిప్రాయం వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోవాలని బీజేపీ, వైసీపీలు కోరుకుంటున్నాయని, ఈ పనులకు అడ్డుతగిలితే అంచనా వ్యయం పెరిగి ప్రాజెక్టు పనులు పూర్తికావనే దురుద్దేశంతో ఆ రెండు పార్టీలు ఉన్నాయన్నారు.
ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాగ్ నివేదికలో పోలవరంలో అవినీతి జరిగినట్లు ఎక్కడా పేర్కొనలేదన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తూ రాష్ట్భ్రావృద్ధికి ఆటంకాలు సృష్టించేవిధంగా ఆ రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలన్నదే తెలుగుదేశం లక్ష్యమని మంత్రి పుల్లారావు అన్నారు.