ఆంధ్రప్రదేశ్‌

గంట నడక.. కిలోమీటరు యాత్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 19: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో సాగిస్తున్న పాదయాత్ర గురువారం గంటలోనే ముగిసింది. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని మాధవనగర్ నుండి ఉదయం 8.30 గంటలకు జగన్ పాదయాత్ర ప్రారంభించారు. జేఎన్‌టియూకే మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండు వరకు ఒక కిలోమీటరు మేర నడిచి ఉదయం 9.30 గంటలకు పాదయాత్ర పూర్తిచేశారు. అనంతరం రోడ్డు మార్గంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ వెళ్ళారు. న్యాయస్థానంలో హాజరయ్యేందుకు హైదరాబాద్ వెళ్ళిన జగన్ తిరిగి శుక్రవారం రాత్రి కాకినాడ చేరుకుని, ఈనెల 21వ తేదీన ప్రజా సంకల్పయాత్రలో పాల్గొంటారు. జగన్ గురువారం అతి కొద్ది సమయం మాత్రమే పాదయాత్ర చేసినప్పటికీ దారి పొడవునా ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. వైసీపీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు తరలివచ్చారు. మార్గ మధ్యంలో అభిమానులతో సెల్ఫీలు దిగారు. వివిధ వర్గాల నుండి వినతిపత్రాలు స్వీకరించి సమస్యలు అడిగి తెలుకున్నారు. స్థానిక కళాశాలలకు చెందిన విద్యార్థినులు జగన్‌తో సెల్ఫీలు దిగి, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. విద్యుత్ శాఖకు చెందిన సీపీఎస్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు సహకరించాలని వైఎస్‌ఆర్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని సమర్పించారు.
ప్రతీ విద్యుత్ ఉద్యోగికీ ఇంటి స్థలం ఇచ్చేలా కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జగన్ స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ సీపీఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీయిచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో వైసీపీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ కన్వీనర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.