ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్‌లో పెరుగుతున్న జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 21: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడుతోందని, కర్నూల్‌లో ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ పర్యటన అనంతరం జోష్ పెరిగిందని ఏఐసీసీ కార్యదర్శి, కోస్తా రీజియన్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛర్జి క్రిష్ట్ఫోర్ తిలక్ అన్నారు. విశాఖ నగర కాంగ్రెస్ కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో శుక్రవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన పాపాన్ని కాంగ్రెస్‌పై నెట్టి అధికార టీడీపీ, విపక్ష వైసీపీ ఎన్నికల్లో లబ్దిపొందాయన్నారు. కోస్తా పరిధిలోని శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకూ తాను 65 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితులును పరిశీలించానని, పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీనిచ్చే స్థితిలో ఉందన్నారు. నాయకత్వం బలంగా ఉన్న చోట పార్టీ కేడర్ కొంతమేర కష్టపడి పనిచేస్తే గెలుపు సాధ్యమేనన్నారు. వార్డు, బూత్ స్థాయిల నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు పీసీసీ రూపొందించిన కార్యాచరణ మంచి ఫలితాలిస్తోందన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో పీసీసీ చేసిన పోరాట ఫలితమే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు హోదా కోసం ఉద్యమిస్తున్నాయన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడమే తమ తొలి ప్రాధాన్యంగా ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం ద్వారా ప్రజల మద్దతు కూడగట్టాలని పిలుపునిచ్చారు. త్వరలోనే ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ఉత్తరాంధ్ర పర్యటనకు రానున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు సత్యనారాయణ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.