ఆంధ్రప్రదేశ్‌

ఇక కాఫర్ డ్యామ్‌ల నిర్మాణంపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 21: పోలవరం ప్రాజెక్టు డయాప్రం వాల్ నిర్మాణం దాదాపు పూర్తవ్వడంతో ఎర్త్‌కం ర్యాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి కాఫర్ డ్యామ్‌ల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టారు. కాఫర్ డ్యామ్‌ల ద్వారా వచ్చే ఏడాదికల్లా గ్రావిటీ ద్వారా నీటి సరఫరా చేసేందుకు ప్రణాళిక చేపట్టారు. ఒకవైపు భూసేకరణ, పునరావాసం, హెడ్ వర్క్సులోని కాఫర్ డ్యామ్‌లపై ప్రత్యేక దృష్టి సారించారు. వారం వారం నిర్ధేశిత లక్ష్యాల మేరకు కాలానికి అనుగుణంగా పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టారు.
కాఫర్ డ్యామ్‌లకు సంబంధించి జెట్ గ్రౌటింగ్ 94.20 శాతం పూర్తయింది. వరద సీజన్ తగ్గిన వెంటనే మిగిలిన 5.80 శాతం జెట్ గ్రౌటింగ్ పూర్తిచేసి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణానికి పనులు చేపట్టనున్నారు. కాఫర్ డ్యామ్‌లకు సంబంధించి మొత్తం 3,467 మీటర్లకు గాను 3,266 మీటర్లు పూర్తయింది. అప్పర్ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ 2,050 మీటర్లు, దిగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ 1,417 మీటర్లు నిర్మాణం పూర్తిచేస్తున్నారు. కాఫర్ డ్యామ్‌ల ద్వారా నీటి ప్రవాహాన్ని స్పిల్ వేకు మళ్ళించి అక్కడ నుంచి కాల్వలకు వెళ్ళే విధంగా చేసి గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా నీటి సరఫరాకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. వాస్తవానికైతే 2019 నాటికి ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పూర్తయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది.
కాఫర్ డ్యామ్‌ల ఆధారంగానే గ్రావిటీ ద్వారా 2019 నాటికి నీటిని సరఫరా చేసేందుకు కార్యాచరణ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రాజెక్టులో ప్రధానమైన స్పిల్‌వే నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేయాల్సివుంది. ఈ పనిని మధుకాన్-శీనోహైడ్రో జాయింట్ వెంచర్‌కు అప్పగించారు. 2005లో ఈ పనులు మొదలయ్యాయి. 2008లో పనులు పూర్తికావాల్సి వుంది. ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యామ్ వాస్తవానికి 2010 నాటికి పూర్తి కావాల్సి వుంది.
కుడి ప్రధాన కాల్వకు సంబంధించి 177.9 కిలోమీటర్లకు గాను లైనింగ్ 149.395 కిలోమీటర్లు పూర్తయింది. ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి మొత్తం 210.927 కిలోమీటర్లకు గాను 179.948 కిలో మీటర్ల మట్టి పని పూర్తయింది. లైనింగ్ 124.593 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో లైనింగ్ అపుడే కొన్నిచోట్ల శిథిలమవుతోంది. స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, లెఫ్ట్ ప్లాంక్‌లకు కలిపి మట్టిపని మొత్తం 864.13 లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తయింది. ప్రస్తుతం కాఫర్ డ్యామ్‌లపై ప్రత్యేక దృష్టితో కార్యాచరణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.