ఆంధ్రప్రదేశ్‌

ఉద్ధృతంగా శబరి నది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఆర్‌పురం, సెప్టెంబర్ 21: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి వరద నీరు చేరడంతో శబరి నది ఆకస్మికంగా పొంగి ప్రవహిస్తోంది. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో విఆర్‌పురం, చింతూరు తదితర మండలాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షం ప్రభావంతో విఆర్‌పురం మండలంలోని జల్లివారిగూడెం వద్ద, చింతూరు మండలం సోకులేరు వద్ద వాగులు పొంగి రహదారి పైనుంచి ప్రవహిస్తున్నాయి. దీనితో చింతూరు, విఆర్‌పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అదే విధంగా రాత్రికి రాత్రి కురిసిన కురిసిన వర్షం ప్రభావంతో మండలంలోని చెరువులన్నీ నిండుకుని అలుగుల మీద నుంచి ప్రవహిస్తున్నాయి.