ఆంధ్రప్రదేశ్‌

కోస్తాతీర పర్యాటక అభివృద్ధిలో నూతన శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఉప రాష్టప్రతి చేతులమీదుగా నేడు పర్యాటక కేంద్రాలు ప్రారంభం...
విజయవాడ (సిటీ), సెప్టెంబర్ 23: పర్యాటక రంగం అభివృద్ధికి మరిన్ని బాటలు వేసే క్రమంలో ఏ ఒక్క అవకాశాన్నీ రాష్ట్ర పర్యాటక శాఖ వదులుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవటంలోనూ అదే వేగాన్ని ప్రదర్శిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం పటిష్టత కోసం నిర్దేశించిన స్వదేశీ దర్శన్ పథకాన్ని ఈక్రమంలోనే పూర్తిస్థాయిలో వినియోగించుకున్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆ ఫలితాలను ఇప్పుడు పర్యాటకులకు అందుబాటలోకి తేనుంది. కోస్తాతీర పర్యాటక అభివృద్ధిలో భాగంగా అటు నెల్లూరు, ఇటు కోనసీమ ప్రాంతాల్లో జరిగిన పర్యాటక ప్రాజెక్టులను రూ. 100కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన జాతీయ పాకశాస్త్ర సంస్థ నూతన భవన సముదాయాన్ని సోమవారం ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జాతికి అంకితం చేయనున్నారు. తిరుపతి కేంద్రంగా జరిగే కార్యక్రమంలో ఏకకాలంలో వీటి ప్రారంభోత్సవాలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. డిజిటల్ విధానంలో జరిగే ఈ కార్యక్రమాల ద్వారా కోట్లాది రూపాయల వ్యయంతో జరిగిన పర్యాటన ప్రదేశాలు ఇకపై అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఏపీ విభజన అనంతరం సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తరుణంలో పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టిపెట్టి దీని అభివృద్ధికి కృషి చేశారు. నిరంతరం సమీక్షలు నిర్వహించిన సీఎం చంద్రబాబు టూరిజం శాఖ తీరుతెన్నులను పరిశీలిస్తూ వచ్చారు. సీఎం సూచనలు, సలహాలతో పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఏపీటీడీసీ ఎండీ హిమాన్షు శుక్లా వేగంగా అడుగులు వేసి కేంద్రం అడిగిన ప్రతీ సమాచారాన్ని అందిస్తూ వచ్చారు. కేంద్ర పర్యాటక శాఖతో ఎప్పటికప్పుడు సత్సంబంధాలు నెరపుతూ రాష్ట్రం కోసం నిధులను పెద్దఎత్తున దిక్కించుకున్నామని ఏపీటీడీసీ ఎండీ శుక్లా తెలిపారు. అలాగే కార్యదర్శి మీనా పలుసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర అధికారులతో మాట్లాడి, వారితో చర్చలు జరిపి మరే రాష్ట్రానికీ దక్కని విధంగా ఏపీకే అధిక నిధులు వచ్చేలా ప్రయత్నించినట్లు చెప్పారు. కోస్తాతీర ప్రాంత పర్యాటక అభివృద్ధిలో భాగంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రూ 60.37 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. దేశంలోనే రెండో అతిపెద్ద సరస్సుగా ఉన్న పులికాట్ అభివృద్ధికి రూ. 22.76 కోట్లు, ఉప్పలమడుగు జలపాతం అభివృద్ధి కోసం రూ. 3.5కోట్లు వ్యయం చేయనున్నారు. ఇక్కడ చేస్తున అభివృద్ధితో పర్యాటకుల సందర్శన మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సైతం ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దతూ రూ. 6.32 కోట్లు ఇప్పటికే ఖర్చుచేశారు. నెల్లూరు ట్యాంక్‌బండ్‌ను సైతం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇక్కడ సుమారు రూ. 42.60 కోట్ల రూపాయలను ఇందుకోసం ఖర్చుచేసింది. మైపాడు బీచ్ కోసం రూ. 8.79 కోట్లు, రామతీర్థం బీచ్ కోసం రూ. 2.99 కోట్లు, ఇసకపల్లి బీచ్ కోసం అరకోటి రూపాయలను ఖర్చుచేసి పర్యాటకులకు అవసరమైన వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. కాకినాడ - హెప్ ఐలాండ్ - కోనసీమ సర్క్యూట్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ భారీ కసరత్తు చేసింది. ఎకో టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.69.83 కోట్లు వ్యయం చేసిన అధికారులు ఎంతో కృషితో అభివృద్ధి చేశారు. ఫలితంగా ఇక్కడ పెద్దఎత్తున పర్యాటక ఆకర్షణలు సమకూరాయి. కాకినాడ బీచ్ ముఖద్వారాన్ని విశేష రీతిలో అభివృద్ధి చేసేందుకు రూ. 45.66 కోట్లు వ్యయం చేశారు. నిర్వహణ కోసం ప్రత్యేకంగా ప్రైవేటు ఏజెన్సీలను ఏర్పాటు చేశారు. హూప్ ఐలండ్ అభివృద్ధి కోసం రూ.80 లక్షలు, కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కోసం రూ. 8.46 కోట్లు పాసర్లపూడిలో రూ. 2.68 కోట్లు, ఆదుర్రులో రూ. 5 కోట్లు, ఎస్‌యానంలో అరకోటి రూపాయలు, కోటిపల్లిలో రూ. 2.14 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశారు. వీటిని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నారు.