ఆంధ్రప్రదేశ్‌

నిర్లక్ష్యం చేస్తే.. అంతే సంగతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 25: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఎన్నో తప్పిదాలను ఎత్తిచూపిన కాగ్ నివేదికను బేఖాతరు చేయడం తగదని, వాస్తవానికి కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోతాయని గుర్తుంచుకోవాలన్నారు. రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టు 2019 నాటికి పూర్తయ్యే పని కాదని కాగ్ నివేదికలో నిర్మొహమాటంగా తేల్చిచెప్పిందన్నారు. ఇంకా డిజైన్లు లేవని, టనె్నల్స్ గానీ, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ గానీ లేకుండా గ్రావిటీపై ఎలా నీరిచ్చేస్తారని కాగ్ ప్రశ్నించిందని, పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హడావిడి ‘ఆకాశంలో ఎగిరే పిట్టను చూసి కింద మసాలా నూరినట్టు’ ఉందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. రిజర్వాయర్‌లో పొర్లిన నీరు స్టిల్లింగ్ బేసిన్ ద్వారా స్పిల్ చానల్‌కు వస్తుందని, డ్యామ్ కూడా సమాంతరంగా నిర్మాణం జరిగినపుడే ఇవన్నీ ఉపయోగంలోకి వస్తాయన్నారు. అసలు పోలవరం రిజర్వాయర్ ఏర్పాటైన తర్వాతే స్పిల్ వే, స్పిల్ చానల్ వంటివన్నీ వినియోగంలోకి వస్తాయన్నారు. డ్యామ్ లేకుండా 2019లో గ్రావిటీపై నీరెలా ఇచ్చేస్తారని, ఎందుకు ప్రజలను మోసం చేయడం అని ఉండవల్లి ప్రశ్నించారు.
పోలవరం డంపింగ్ యార్డుల విషయంలో అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం అవసరమైన స్ధలాన్ని రైతుల నుంచి నష్టపరిహారం చెల్లించి కాంట్రాక్టరే ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. కానీ ప్రభుత్వ అధికారులు రైతులను బెదిరించి కాంట్రాక్టరుకు సహకరించారన్నారు. లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం వివరణ తీసుకున్న తర్వాతే కాగ్ తన నివేదికలో పొందుపర్చుతుందని, అనంతరం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)లో కాగ్ నివేదికపై చర్చిస్తారన్నారు. కాగ్ నివేదిక చదివితే ఈ ప్రభుత్వం అనవసరం అనే అభిప్రాయం కలుగుతుందన్నారు. పోలవరం పలు పనులు రెట్టింపు శాతానికి ఎందుకు ఇచ్చారని కాగ్ ప్రశ్నించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థ లేదని కాగ్ ప్రశ్నించిందన్నారు. తాను 2016లోనే క్వాలిటీ కంట్రోల్ లేదని ఎత్తిచూపానని, అదే విషయం ఇపుడు కాగ్ కూడా ప్రశ్నించిందన్నారు. తాను చేసే ఆరోపణలపై సంబంధిత ఈఎన్సీ గానీ, సీఈ గానీ ఎవరైనా సమాధానం చెప్పొచ్చని, తన ఆరోపణలు అబద్ధమని తేలితే ఇక మళ్ళీ జీవితంలో పోలవరం గురించి మాట్లాడనని ఉండవల్లి మరోసారి సవాల్ చేశారు.
టెక్నాలజీ రహస్యం...చెల్లింపులు కూడానా!
రాఫెల్ కుంభకోణం చాలా భారీ స్థాయి వ్యవహారమని సమాచారాన్ని బట్టి తెలుస్తోందన్నారు. ధర విషయంలో పార్లమెంట్‌లో సభ్యులు ప్రశ్నిస్తే సంబంధిత మంత్రి అది రహస్యమని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. టెక్నాలజీ రహస్యం గానీ, చెల్లింపులు రహస్యమేమిటో అర్ధం కావడం లేదన్నారు. అరకు శాసన సభ్యుడు, మరో మాజీ శాసన సభ్యుడిని మావోయిస్టులు చంపేస్తే ఆ సమస్యను శాంతిభద్రతల సమస్యగా పరిగణించకూడదని, వ్యవస్థలో మార్పు రావాలని, ఆ మార్పు ప్రజలు ప్రశ్నించినపుడే వస్తుందన్నారు.
నెహ్రూపై మోదీ వ్యాఖ్యలు దురదృష్టకరం
ఈ దేశానికి మహాత్మాగాంధీ ఒక ఐడియాలజిస్ట్ అయితే, నెహ్రూ ఒక ఆర్కిటెక్టు అని, అటువంటి నెహ్రూపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు దురదృష్టకరమని ఉండవిల్లి అన్నారు. మోదీ వ్యాఖ్యలు ప్రధాని హోదాను దిగజార్చినట్టుగా ఉన్నాయన్నారు. మోదీ ఒకరే నిజాయితీ పరుడని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ వారంలోనే కుటుంబరావుతో చర్చ
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావును ఇటీవలే తాను కలిశానని, ఈ వారంలోనే చర్చకు అంగీకరించారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. తన ఆరోపణలపై చర్చకు అంగీకరించిన నేపథ్యంలో పోలవరంపై కాగ్ నివేదికతో పాటు అన్న క్యాంటీన్లు, ఆదరణ పథలపై కూడా చర్చించాలని కోరుతున్నానన్నారు. బిగ్ బాస్ కార్యక్రమం మాదిరిగా ఒక ఇంట్లో కూర్చుని చర్చించుకుని, ఆపై దానిని మీడియాకు వెల్లడించడమా లేక, మీడియా సమక్షంలోనే చర్చించుకోవడమా అనే విషయం కుటుంబరావు నిర్ణయిస్తారన్నారు.