ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్ కార్యకర్తల కంఠధ్వని ‘ప్రాజెక్ట్ శక్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 25: దేశంలోని కాంగ్రెస్ కార్యకర్తల కంఠధ్వనికి ప్రతిధ్వనిగా ప్రాజెక్ట్‌శక్తి పనిచేస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఊమెన్‌చాందీ అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇటీవల ప్రారంభించిన ప్రాజెక్టు శక్తిని మంగళవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉమెన్ చాందీ, ఏఐసీసీ కోర్ కమిటీ సభ్యులు కొప్పుల రాజు తదితరులు ప్రారంభించారు. తొలుత నగరంలో శ్రీ రామ ఫంక్షన్ హాలులో ప్రాజెక్టు శక్తి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శక్తి గురించి వివరించేందుకు ప్రొజెక్టర్ ద్వారా వీడియోను ప్రదర్శించారు. ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్లు శశాంక్ శుక్లా, స్వప్న ప్రాజెక్టు శక్తి గురించి వివరించారు. అనంతరం ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులను ప్రాజెక్టు శక్తిలో ఎస్‌ఎంఎస్ ద్వారా భాగస్వాములను చేశారు. అనంతరం కే రాజు మాట్లాడుతూ దేశంలో ప్రతి గ్రామం, మండలం, బ్లాక్, టౌన్, జిల్లా పార్టీ కార్యకర్తలకు పార్టీ కార్యక్రమాలు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముఖ్య సందేశాలను నేరుగా అందించే ప్రయత్నమే ప్రాజెక్టు శక్తి అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్టు శక్తిని ప్రారంభించినట్లు తెలిపారు. దేశంలో ఏపీ 17వ రాష్ట్రం అన్నారు. దాదాపు దేశ వ్యాప్తంగా 30 లక్షల మంది నమోదు చేసుకున్నారన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త విధిగా ప్రాజెక్టు శక్తిలో నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకు ఓటర్ ఐడీ నెంబర్‌ను మీ ఫొన్ ద్వారా 8108048888కు ఎస్‌ఎంఎస్ పంపిస్తే చాలన్నారు. దీంతో వారికి ప్రాజెక్టు శక్తి నుంచి ఎస్‌ఎంఎస్ వస్తుందన్నారు.