ఆంధ్రప్రదేశ్‌

డిమాండ్‌కు సరిపడా విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 19: ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొత్తగా ఎన్ని పరిశ్రమలు వచ్చినా ఇకపై విద్యుత్‌కు చింతలేదు. అవసరమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ట్రాన్స్‌కో సిద్ధంగా ఉంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో ఎక్కడైనా పరిశ్రమల స్థాపించాలంటే ముందుగా అవసరమయ్యేది విద్యుత్. గృహ అవసరాలకు విద్యుత్ వాడకం ఎక్కువుగా ఉంటోంది.
వాణిజ్య అవసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కొత్త కనెక్షన్ల శాతం అనూహ్యంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్తగా పరిశ్రమలు స్థాపించాలంటే పారిశ్రామికవేత్తలు ముందుగా విద్యుత్ కోరుతున్నారు. అందువల్ల వీటన్నంటినీ దృష్టిలోపెట్టుకుని పరిశ్రమల స్థాపనకు సరిపడా విద్యుత్ సమకూర్చాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస-పాలకొండ ప్రాంతాల మధ్య 400కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నిర్మించాలని నిర్ణయించింది. 80 ఎకరాల ప్రభుత్వ స్థలంలో రూ.150 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నిర్మించేందుకు ట్రాన్స్‌కో ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబందించి ప్రభుత్వ భూమి ఉండటంతో ప్రాథమికంగా సబ్‌స్టేషన్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. అమదాలవలసలో 400కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టి రెండేళ్లలోనే అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వస్తే విశాఖ కలపాకలో ఉన్న 400కేవీ సబ్‌స్టేషన్‌మీద లోడ్ తగ్గుతుంది. విశాఖలో ఉన్న ఎన్టీపీసీ నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరమూ తగ్గనుంది. ఇదిలా ఉండగా విజయనగరం జిల్లా మరడాంలో నాలుగు నెలల కిందట రూ.200 కోట్ల వ్యయంతో 400 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మించింది. దీని ద్వారా 500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. దీంతో రానున్న రోజుల్లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో కొత్తగా స్థాపించే పరిశ్రమలకు విద్యుత్ సమస్యలు తలెత్తవని ఏపీ ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు.