ఆంధ్రప్రదేశ్‌

హోదా కోసం పదవీ త్యాగం చేసింది మేమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), అక్టోబర్ 11: ప్రత్యేక హోదా కోసం మొదటి నుండి పోరాట చేస్తున్నది రాష్ట్రంలో ఒక్క వైకాపానేనని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వైకాపా ఏంపీలు హోదా కోసం రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేశారని, గుంటూరులో తమపార్టీ అధినేత జగన్ ఆమరణ దీక్ష చేస్తే దాన్ని భగ్నం చేసింది చంద్రబాబేనన్నారు. వైకాపా ఎంపీలు పదవులను తృణప్రాయంగా భావించి రాజీనామా చేస్తే తమని విమర్శించే హక్కు టీడీపీ నాయకులకు లేదన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు కావాలని వైకాపా ఎప్పుడూ భావించలేదన్నారు. టీడీపీ అనైతికంగా కొనుగోలు చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు 23 మందిపై అనర్హత వేటు వేస్తే తప్పకుంటా ఉపఎన్నికలు వచ్చేవన్నారు. ఫిరాయింపు ఎంపీలపై చర్యలు తీసుకున్నా ఉప ఎన్నికలు వచ్చేవన్న ఆయన మీ చేతిలో ఉన్న ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాలుగా భాగస్వామిగా ఉండి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రి చంద్రబాబేనన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు కేంద్రంపై అవిశ్వాసం పెట్టామని గుర్తు చేశారు. తమ రాజీనామాలకు సార్థకత రావాలంటే ఎన్నికలు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాజీనామాల అమోదం కోసం ఎన్నో సార్లు స్పీకర్‌ను కలిసి చేతులు జోడించి వేడుకున్నట్లు తెలిపారు. పగలు కాంగ్రెస్‌తో రాత్రి బీజేపీతో ఒప్పందాలు చేసుకుంటున్న చంద్రబాబు, కేంద్రాన్ని జగన్ ప్రశ్నించడం లేదనడం దారుణమన్నారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో డ్రామాలు అడుతుంటే వైకాపా ఎంపీలు చిత్తశుద్ధితో రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేశారన్నారు. పోలవరం ముంపు మండలాల కోసం పట్టుబట్టిన చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఎందుకు పట్టుబట్టలేదన్నారు. రాష్ట్రంలో దోచుకున్న సొమ్ము బయటకు వస్తుందనే ఐటీ దాడులంటే చంద్రబాబు భయపడుతున్నారని ఆరోపించారు. చట్టాలు అందరికీ సమానమేనన్న ఆయన ఏవ్వరూ దానికి అతీతులు కాదన్నారు. వంగవీటి రాధా వైకాపాలోనే ఉన్నారని, పార్టీ బలాన్ని బట్టి గెలిచే అవకాశాలున్న అభ్యర్థిని అధినేత నిర్ణయిస్తారన్నారు. జాతీయ పార్టీలతో పొత్తులకు తాము వెంపర్లాడబోమన్నారు. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే రక్షణ నిధి, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్ పాల్గొన్నారు.