ఆంధ్రప్రదేశ్‌

ఏపీ ఇబ్బందులు మీ మాటల్లోనే తెలుస్తున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 11: వివిధ రాజకీయ పార్టీలు చెప్పిన విషయాలు విన్నాక, ఏపీ ఇబ్బందులు తెలుస్తున్నాయని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ నంద్ కిషోర్ సింగ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న 15వ ఆర్థిక సంఘం వెలగపూడి సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం సమావేశమైంది. ఆయా పార్టీల నుంచి ఆ సంఘం సలహాలు, సూచనలు స్వీకరించింది. బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి సుధీష్ రాంబోట్ల మాట్లాడుతూ ఏపీకి కేంద్రం అన్ని విధాల సాయం అందిస్తోందన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తోందని విమర్శించారు. దీని వల్ల అనవసర ఖర్చులు పెరుగుతున్నాయన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో మూడు పంటలు పండే భూమిని సేకరించారని విమర్శించారు. కోస్తా ప్రాంత అభివృద్ధికి నిధులు ఇవ్వాలన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ కోల్పోవడంతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు పిజె చంద్రశేఖర రావు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. 15, 14వ ఆర్థిక సంఘాల లక్ష్యాలు వేర్వేరుగా ఉన్నాయన్నారు. నాలుగేళ్లు కావస్తున్నా, ఇప్పటి వరకూ గిరిజన సంక్షేమ కమిటీ ఏర్పాటు చేయలేదన్నారు. పార్లమెంట్‌లో ప్రధాని చేసిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేయాలని కోరారు.కడప ఉక్కు, రైల్వే జోన్ ఊసు ఎత్తడం లేదని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ విభజన కారణంగా ఏపీ ఆదాయం తగ్గుముఖం పట్టిందన్నారు. పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలు అమలు చేయడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరులో జాప్యం చేస్తున్నారని తెలిపారు. జాతీయ విద్యా సంస్థలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయన్నారు. వైకాపా నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాదయాత్రలో ఉండటం వల్ల తమ నేత జగన్ హాజరు కాలేకపోయారని, ఆయన రాసిన లేఖ అందచేశారు. రాజధాని కోసం నిబంధనలకు వ్యతిరేకంగా భూములు సేకరించారని ఆరోపించారు. ప్రత్యేక హాదా సెంటిమెంట్‌గా మారిందని, ఈ మేరకు సిఫారసు చేయాలన్నారు. అనంతరం వివిధ పార్టీల ప్రతినిధులు వినతిపత్రాలు సమర్పించారు. వీటిపై ఆర్థికసంఘం చైర్మన్ స్పందిస్తూ, నిధుల కేటాయింపుల్లో వివిధ పార్టీలు ఇచ్చిన సలహాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. రాజ్యాంగానికి లోబడే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.