ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర సమాచార కమిషనర్ల ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 12: ఏపీ రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమితులైన ఎం రవికుమార్, బీవీ రమణకుమార్, కట్టా జనార్ధన్‌రావు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. వెలగపూడి సచివాలయంలో సీఎం బ్లాక్‌లోని గ్రీవెన్స్ హాల్‌లో రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరిచేత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఒకరి తరువాత ఒకరు ప్రమాణస్వీకారం చేశారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి, హోం శాఖ కార్యదర్శి అనూరాధ, న్యాయ శాఖ కార్యదర్శి వెంకటరమణ, సమాచార కమిషన్ కార్యదర్శి శ్రీ్ధర్, తదితరులు పాల్గొన్నారు.