ఆంధ్రప్రదేశ్‌

తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో రంగంలోకి 50 మంది ఐఏఎస్ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 13: తిత్లీ తుపాను ప్రభావంతో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణ పరిస్థితి తీసుకువచ్చేందుకు ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది. 50 మంది ఐఏఎస్ అధికారులను, 100 మంది డిప్యూటీ కలెక్టర్లను, మరో 136 మంది ఇతర అధికారులను శ్రీకాకుళానికి పంపింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను వీలైనంత త్వరగా తీసుకువచ్చేందుకు ఈ అధికారులు తమ సేవలు అందించనున్నారు.

స్వైన్ ఫ్లూతో వ్యక్తి మృతి
చిత్తూరు, అక్టోబర్ 13: స్వైన్ ఫ్లూ వ్యాధితో వ్యిక్తి మృతి చెందిన సంఘటన శనివారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెనుమూరు మండలం పలికల్లు గ్రామానికి చెందిన చలపతి రెడ్డి (51) అస్వస్థతకు గురికావడంతో అతన్ని కుటుంబ సభ్యులు వేలూరు సీ ఎం సీ అసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ చలపతిరెడ్డికి స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు సీఎంసీ వైద్యులు నిర్థారించారు. అక్కడే చికిత్స పొందుతున్న చలపతి రెడ్డిని శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు చిత్తూరు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందున్న ఆయన శనివారం ఉదయం మృతి చెందాడు. చలపతిరెడ్డికి స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలతో పాటు కిడ్నీ కూడా దెబ్బతినడంతో అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.