ఆంధ్రప్రదేశ్‌

మూర్తి సేవలు నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 13: గీతం విద్యా సంస్థల చైర్మన్, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి సేవలు నిరుపమానమని పలువురు కొనియాడారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మూర్తి సంతాపసభలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందించిన మూర్తితో కలిసి తాను పార్లమెంట్ సభ్యునిగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రతినిధిగాప్రాతినిధ్యం వహిస్తున్నందున విధిగా చట్టసభలకు హాజరుకావాలని, అది మన బాధ్యతగా గుర్తించాలని చెప్పే వారన్నారు. రెండు సార్లు ఎంపీగా పనిచేసినప్పటికీ గత ఎన్నికల్లో అవకాశం రాకపోయినా పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి మిత్రపక్ష బీజేపీ అభ్యర్థి విజయానికి పనిచేశారన్నారు. ఇదే సభలో మూర్తి మనుమలు శ్రీ్భరత్, భరద్వాజ పాల్గొని తాతా గారి రాజకీయ అనుభవాలను వక్తలు చెబుతుంటే ఆసక్తిగా విన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, వాసుపల్లి గణేష్‌కుమార్, బండారు సత్యనారాయణ మూర్తి, పల్లా శ్రీనివాస్, పలువురు నాయకులు పాల్గొన్నారు. దివంగత ఎంవీవీఎస్ మూర్తి దినకర్మ విశాఖలో ఆదివారం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహా పలువురు మంత్రులు,టీడీపీ నాయకులు హాజరుకానున్నారు.