ఆంధ్రప్రదేశ్‌

గుజరాత్‌లో ఐటీ దాడులు చేయించగలరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 13: దేశంలో అవినీతి రహిత రాష్ట్రాల్లో ఏపీ 3వ స్థానంలో నిలవడం రాష్ట్ర ప్రజలందరూ సంతోషించాల్సిన విషయమని విజయవాడలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వం మూకుమ్మడిగా రాష్ట్ర నాయకత్వంపై అర్థంలేని ఆరోపణలతో దాడులు చేస్తున్న వేళ ఒక అంతర్జాతీయ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసించిందన్నారు.
ట్రాన్స్‌ఫరెన్సీ ఆఫ్ ఇండియా నివేదిక కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు చెంపపెట్టు అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతుందని నిత్యం గగ్గోలు పెట్టే రాజకీయ నిరుద్యోగులు ఇకనైనా బుద్ధి మార్చుకోవాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు సర్వసాధారణమని, ప్రభుత్వానికి, పార్టీకి దాడులతో ప్రమేయం లేదని చెబుతున్న బీజేపీ నేతలు గుజరాత్‌లో పన్నులు ఎగ్గొట్టిన వారిపైన, బ్యాంకులను కొల్లగొట్టిన వారిపైన చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు మనోధైర్యం కల్పిస్తున్నారన్నారు.
తుపాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలు, ప్రాంతాలను ఆదుకోవాలని రూ. 2800 కోట్ల సాయం అందించాలని ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాశారన్నారు. ఈ సమయంలోనైనా కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మానుకుని మానవత్వంతో వ్యవహరించాలంటూ యామిని కోరారు.