ఆంధ్రప్రదేశ్‌

అయ్యో...గౌరంగబాబు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 16: విజయవాడ కనకదుర్గ ఆలయ పాలకమండలి చైర్మన్ గౌరంగబాబుకు మరోసారి అవమానం ఎదురైంది. దీంతో కొంతసేపు ఆయన పాత ఆశీర్వాద మండపం వద్ద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే మూలా నక్షత్రం, సరస్వతీ దేవి అవతారం రోజు ఆయనను దర్శనానికి, కార్యాలయంలోకి అనుమతించకపోవడం వివాదాస్పదంగా మారడం తెలిసిందే. పోలీసులు, ఈవో క్షమాపణ చెప్పి వివాదానికి తెరదించిన రెండు రోజులకే మరోసారి చైర్మన్‌కు చేదు అనుభవం ఎదురవడం గమనార్హం. దుర్గగుడి దసరా ఉత్సవాలు జరుగుతుండటంతో చైర్మన్ తన కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులతో మంగళవారం అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఆ సమయంలో వారిని వీఐపీ క్యూలైన్లలో వెళ్లి దర్శనం చేసుకోవాలని ఈవో కోటేశ్వరమ్మ సూచించారు. దీంతో అసహనానికి గురైన చైర్మన్ ఈవోతో వాగ్వివాదానికి దిగారు. చైర్మన్ హోదాలో తనకు ప్రత్యేక ప్రొటోకాల్ ఉంటుందని, ఆ హోదాలో తన కుటుంబ సభ్యులను దర్శనానికి తీసుకువస్తే, ఇలా చేస్తారా అంటూ ప్రశ్నించారు. దీంతో అలక వహించిన ఆయన తన కుటుంబ సభ్యులను తన చాంబర్‌కు పంపారు. ఆ తరువాత పాత ఆశీర్వాద మండపం వద్ద వౌనంగా కూర్చుని నిరసన తెలిపారు.
చాలా సేపు చైర్మన్ అక్కడే కూర్చని నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఈవో అక్కడకు వచ్చి చైర్మన్‌కు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చైర్మన్ హోదాలో తాను కొంతమందిని దర్శనానికి తీసుకువస్తే, క్యూలైన్లలో వెళ్లడనడం సరికాదని ఈవోతో గౌరంగబాబు అన్నారు.
అయితే చైర్మన్ కుటుంబ సభ్యులని తెలియకపోవడంతో క్యూలైన్లలో పంపాల్సి వచ్చిందని ఈవో వివరణ ఇచ్చారు. ఆ విషయం చెప్పి ఉంటే ప్రత్యేక ప్రవేశ మార్గంలో దర్శనానికి అనుమతించేవారమన్నారు. తరువాత ఆ విషయాన్ని కుటుంబ సభ్యులుకు తెలిపి, అమ్మవారి దర్శనానికి పంపారు. ఒక దశలో పాత ఆశీర్వాద మండపం వద్ద చైర్మన్ కూర్చోగా, కొత్త ఆశీర్వాద మండపం వద్ద ఈవో కూర్చోవడం గమనార్హం.
ఈవో ఆదేశాలు బేఖాతర్
అంతరాయలం వద్ద ఉన్న చిన్నగేటు నుంచి ఎవరినీ అనుమతించ వద్దని ఈవో కోటేశ్వరమ్మ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పరిస్థితిలో మార్పులేదు. మూలా నక్షత్రం రోజు ఆదివారం మాత్రం అన్ని గేట్లకు తాళాలు వేయడం వల్ల ఆ గేటు ద్వారా ఎవరినీ అనుమతించలేదు. దీంతో ఆ గేటు వద్ద ఎవరూ కనిపించలేదు. కానీ మంగళవారం మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. ఆ గేటు వద్దకు భారీగా భక్తులు వచ్చారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. ఆ గేటు ద్వారా ప్రవేశాలను నిరోధించేందుకు పోలీసులు నానా అగచాట్లు పడ్డారు. అయినా నిరోధించేలేకపోయారు.
దర్శనం అనంతరం బయటకు వచ్చే మార్గం నుంచి కూడా వెళ్లేందుకు కొంతమంది ప్రయత్నించడం కనిపించింది. మంగళవారం దాదాపు పరిస్థితి అదుపు తప్పిందనవచ్చు.