రాష్ట్రీయం

‘మహాదుర్గ’గా భద్రకాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 17: వరంగల్ మహానగరంలోని శ్రీ భద్రకాళి దేవాస్ధానంలోఅత్యంతవైభవంగా నిర్వహిస్తున్న దేవీశరనవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు బుధవారం నాటికి 8వ రోజుకు చేరుకున్నాయి. మహాదుర్గగా భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 4గంటలకు ప్రారంభమైన ఆలయ నిత్యాహ్నికం నిర్వహించి ఉదయం మహాగౌరి దుర్గా క్రమంలో, సాయంత్రం నిశుంభహా దుర్గా క్రమంలో అమ్మవారికి పూజారాదనలు జరిపారు. అనంతరం మహాష్టమి కృత్యం నిర్వహించబడింది. దేవి బాగవతంలో చెప్పబడిన ప్రకారం దుర్గా మహాఅష్టమి నాడు కోటి యోగినీ గణములతో భద్రకాళిగా ఈ భూమండలం మీద అవిర్భవించిన ప్రదేశం తెలంగాణ రాష్ట్రంలో కాకతీయుల రాజాదాని ఏకశిలనగరంగా చరిత్ర ప్రసిద్ధి గాంచిన ఈ వరంగల్ మహానగరమే. బుధవారం దుర్గను భద్రకాళిగా మూడు పూటలు శ్రద్ద్భాక్తులతో తప్పకుండా పూజించాలని దేవి బాగవతం చెప్తుంది. దుర్గాష్టమిగా పిలువబడే మహాఅష్టమి రోజున భద్రకాళిని కేవలం వరంగల్ నగరమే కాదు దేశంలో ఎక్కడైన సరే నవరాత్రవ్రతం జరిపే ప్రతి ఇంటి దుర్గను భద్రకాళిగా ఆరాధిస్తారు. భద్ర అన్న, భద్రకాళి అన్న భద్రేశ్వరీ అన్న నేనే కొంచెం కూడా అంతరం లేదు. రోజు ఆరాధించిన వారికి కష్టాలను దరిచేరనీయ్యను. సకలైశ్వర్యములను ఇస్తానని అమ్మవారు దేవి భాగవతంలో చెప్పారు. ఏకామ్రనాధుని ప్రతాపరుద్ర చరిత్రము, కాసె సర్వప్ప వ్రాసిన సిద్ధేశ్వరి చరిత్రము, విద్యానాధుడు వ్రాసిన ప్రతాపరుద్రీయంధ్రప్రతాపరుద్ర యశోభూషణం ఇత్యాది అనేక గ్రంధాలను పరిశీలించగా భౌగోళికంగా పౌరాణికి అధారాలను పరిశీలించి
సమన్వయ పరిచి చూస్తే దుర్గా భద్రకాళిగా కోటి యోగీని గణములతో భూమండలం మీద అవతరించిన ప్రదేశం వరంగల్ నగరంలోని అత్యంత ప్రాచీనమైన చరిత్ర కలిగినది భద్రకాళి దేవాలయమే. ఫలితంగానే దేశ, దేశాల ప్రజలు దుర్గాష్టమి నాడు భద్రకాళిని దర్శించుకోవలనే కుతుహాలంతోవస్తారు. అమ్మవారిని ఈ రోజు మహిషమర్ధిని దర్గా అలంకరించారు. మార్కెండేయ పూరాణాంతర్గత చండీసప్తశతీ మధ్యమ చరిత్రంలో భద్రకాళి అమ్మవారే మహిషాసురుడిని సంహరించి మహిషామర్ధిని పేరుగాంచినందున అమ్మవారిని మహిషాసుర మర్ధినిగా అలంకరించారు. మహిషామర్ధిని దుర్గా అలంకరంలో అమ్మవారిని దర్శించుకోవడానికి రెండు కళ్లు సరిపోవడం లేదని తన్మయంతో చెప్పారు. సాధకుడికి అమ్మవారి యెక్క అనుగ్రహం వల్ల విద్య, పరక్రామం, ధనము, శారీరక శక్తి, ఇత్యాది పలు విధములైన శక్తులు అమ్మవారి దయవల్ల ప్రాప్తించగా ఇవ్వన్ని తాను గోప్పవారైనందువల్లేనే కలిగయని అన్న బ్రాంతి వల్ల మనిషిలో దుర్మధములు పెచ్చురిల్తుతాయి. అట్లాంటి దుర్మధములను అనిచిపరేసే పరిపూర్ణనాన్ని కలిగించి ముక్తిని ప్రసాదిస్తుందన్న దానికి సంకేతకంగా అమ్మవారిని మహిషా మర్ధినిగా అలంకరించి ఆరాధిస్తారు. మహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల మనిషిలో సమస్తమైన దుర్మదములు అనిగిపోయి పరిపూర్ణత్వం కలుగుతుంది. ఉదయం అమ్మవారిని భద్ర పీఠంపై, సాయంత్రం అశ్వవాహనంపై ఉరేగించారు. భద్రకాళి మహాదుర్గాగా భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వగా భక్తులు పులకరించిపోయారు.