ఆంధ్రప్రదేశ్‌

బాధితులను చేతల్లో ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 17: తిత్లీ బాధిత కుటుంబాలను మాటల్లో కాకుండా చేతల్లో ఆదుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జిల్లాలోని టెక్కలి నియోజక వర్గ పరిధిలో తుఫాన్ ప్రభావిత మత్స్యకార గ్రామాల్లో బుధవారం పవన్ కల్యాణ్ పర్యటించారు. బాధితుల సమస్యలను వింటూ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. భావనపాడులో పర్యటించి ప్రభుత్వం నుంచి బాధితులకందుతున్న సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో విఫలమయిందని ఆరోపించారు. తుఫాన్ సహాయార్థం కేంద్రానికి సాయం కోరుతూ జిల్లాను ఆదుకోవాలని లేఖ రాస్తానని వెల్లడించారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. జనసేన తరుఫున ప్రతీ ఒక్క బాధితునికి నష్టపరిహారం అందించేందుకు పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపడుతుందని , పూర్తిస్థాయిలో ఆదుకోవడం లేదని మండి పడ్డారు. మూడు రోజుల పాటు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తానని, ఎంత నష్టం జరిగిందో తెలుసుకొని బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తానన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు దాహంతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినా వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌తో పాటు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.