ఆంధ్రప్రదేశ్‌

అన్యాయంపై ప్రశ్నిస్తే సీబీఐ, ఐటీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 17: ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన వారి గొంతు నొక్కడానికి కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తోందని లోక్‌సభలో టీడీపీ పక్ష నేత, కాకినాడ ఎంపీ తోట నరసింహం అన్నారు. తెలుగుదేశం నేతలు, ప్రజాప్రతినిధులపై ఉద్దేశ్యపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తోందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు పూర్వం నుండీ ఆస్తులున్నాయని, ఆయన ఆస్తులపై నేడు కుట్రపూరితమైన దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రంతో పోరాడిన వారిపై దాడులు చేయిస్తోందన్నారు. ఈ విధమైన దాడులకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తిలేదన్నారు. కేంద్రంపై టీడీపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టంచేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయంలో టీడీపీ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కట్టుబట్టలతో మిగిలామని, అనేక కష్టనష్టాలను అనుభవిస్తూ నవ్యాంధ్రను అభివృద్ధి పథాన నడపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషిచేస్తున్నారన్నారు. విభజన హామీలను అమలుచేయాలని పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తామని, నవంబర్‌లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలుగెత్తి చాటుతామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చేసిన అన్యాయంపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు.
‘మీరు పార్టీ ఫిరాయించుతారన్న ప్రచారం జరుగుతోంది కదా’? అన్న ప్రశ్నకు తెలుగుదేశం పార్టీని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వీడేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా కృషి చేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తారట కదా? అన్న ప్రశ్నకు పార్లమెంట్‌కు పోటీ చేయాలా? అసెంబ్లీకి పోటీ చేయాలా? అనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని ఎంపీ తోట వ్యాఖ్యానించారు.