ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైల భ్రమరాంబకు బంగారు ఖడ్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 17: శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన కంకర రవీంద్రారెడ్డి దంపతులు వజ్రాలు అమర్చిన బంగారు ఖడ్గాన్ని బుధవారం బహూకరించారు. 400 గ్రాముల వజ్రాలు అమర్చిన బంగారు ఖడ్గం విలువ సుమారు రూ. 15 లక్షలు వరకు ఉంటుందని దాతలు తెలిపారు. ఈ ఖడ్గాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో కార్యనిర్వహణాధికారికి దాతలు ఈ ఖడ్గాన్ని అంచజేశారు.
అంతకుముందు బంగారు ఖడ్గానికి సంప్రోక్షణ చేసి పూజాదికాలు నిర్వహించారు. అనంతరం దాతలను ఆలయ పండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు.

ఆర్టీసీ వేతన సవరణకు కమిటీ
విజయవాడ, అక్టోబర్ 17: ఏపీఎస్ ఆర్టీసీలో పని చేస్తున్న దాదాపు 53వేల మంది ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి 2017 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జరగాల్సిన వేతనల సవరణ కోసం గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్‌తో యాజమాన్యం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
గుర్తింపు సంఘం గత నెల 20వ తేదీ 91 అంశాలతో ఇచ్చిన వేతన సవరణ ప్రతిపాదనపై సమగ్రంగా చర్చించేందుకు ‘పే కమిటీ’ సభ్యులను యూనియన్ నుంచి ప్రతిపాదించాలంటూ ఆర్టీసీ సంస్థ ఎండీ ఎన్‌వీ సురేంద్రబాబుకి బుధవారం లేఖ పంపించారు. విజయ దశమి (దసరా) పర్వదినం తరువాత తమ సభ్యుల వివరాలను అందించి ఈ నెలాఖరులోనే తొలి సమావేశానికి సిద్ధమవుతామంటూ ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరావు, అధ్యక్షుడు వైవీ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.