ఆంధ్రప్రదేశ్‌

విజయాలకు సంకేతంవిజయ దశమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 17: చెడుపై మంచి గెలుపునకు సంకేతమే విజయదశమి అని, మంచి సంకల్పాలకు దేవతల ఆశీర్వచనాలు లభించే శుభ సమయం ఇదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చెడుపై మంచి ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుందని, గెలవాలన్నదే తమ అభిమతమని ముఖ్యమంత్రి వివరించారు. తెలుగు లోగిళ్లలో ఆనందం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు దేశ విదేశాల్లో నివశిస్తున్న తెలుగు వారికి ఆయన విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకోవడం కూడా రాక్షసత్వమేనని చంద్రబాబు అన్నారు. అటువంటి శక్తులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అమ్మవార్ల దీవెనలతో పాటు, ప్రజల ఆశీస్సులు తమకు కొండంత బలానిస్తాయని, రాష్ట్భ్రావృద్ధికి మరింత కృషి చేసే శక్తినిస్తాయని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో తీర ప్రాంతం తిత్లీ తుపానుకు దెబ్బతింటే కేంద్రం నయాపైసా సహాయం చేయలేదని చెప్పారు. పండుగ వేళ కుటుంబానికి దూరంగా ఉన్నా ఫర్వాలేదని, ప్రజలు బాగుండడమే తనకు పండుగ అన్నారు.

కొత్త వెలుగులు నింపాలి: జగన్
విజయవాడ(సిటీ): చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమి పండుగ తెలుగు ప్రజలందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆకాంక్షించారు. లోకంలోని ప్రజలందరినీ రక్షించే దుర్గామాత తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సుఖ శాంతులు, సిరి సంపదలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

తుపాను బాధితులను జగన్మాత కరుణించాలి: పవన్
తిత్లీ తుపాను ప్రభావంతో బాధితులుగా మిగిన వారిని ఆ జగన్మాత కరుణించాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఆకాంక్షించారు. భారతీయులందరికీ తన తరఫున, జన సైనికుల తరఫున పవన్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయదశమి పండుగకు తాను సంతోషంగా లేనన్నారు. తుపాను కారణంగా వేల మంది నిరాశ్రయులయ్యారన్నారు. తుపానుకు చిన్నాభిన్నమైన శ్రీకాకుళం జిల్లా త్వరగా కోలుకోవాలన్నారు. ఆ జగన్మాత మనందరిపై కరుణ చూపాలని ఆయన కోరుకున్నారు.

పండుగ వేళ సిక్కోలులో ప్రజల మధ్యనే సీఎం
విజయవాడ, అక్టోబర్ 17: దసరా పండుగ వేళలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల మధ్య గడుపుతున్నారు. తిత్లీ తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లా అతలాకుతలవడంతో వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితికి తీసుకువచ్చేందుకు సహాయక చర్యలను అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల తీరును, ప్రజల సంతృప్తిని ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా తెలుసుకుంటూ తుపాను బాధితులకు ప్రభుత్వ సాయం అందేలా చర్యలు చేపడుతున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి శ్రీకాకుళం నుంచి వచ్చి మూలా నక్షత్రం రోజున పట్టవస్త్రాలను సమర్పించారు. మళ్లీ మంగళవారం బయలుదేరి శ్రీకాకుళం వెళ్లారు. బుధవారం కూడా అక్కడ ఉండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ, అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. దుర్గాష్టమి రోజైన బుధవారం శ్రీకాకుళంలోనే ఉండి, ప్రజల మధ్య గడిపారు. గురువారం కూడా దాదాపు అక్కడే ఉండి మహర్నవమి రోజు న ప్రజల మధ్య గడుపనున్నారు. దసరా ఉత్సవాల్లో కు టుంబ సభ్యులకు దూరంగా ఉన్నప్పటికీ, ప్రజల మధ్య ఉంటూ క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది కూడా దీపావళి నాడు అమెరికాలోని ఆయోవా వ్యవసాయ క్షేత్రంలో పర్యటించడం తెలిసిందే.